ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరాటం వల్ల భారత్ నుంచి జరిగే బాస్మతి బియ్యం (Basmati) ఎగుమతులకు పెద్ద ఆటంకం కలిగింది. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన సరుకు రవాణా నిలిచిపోవడంతో ఢిల్లీలోని గోదాముల్లో సుమారు 4 లక్షల టన్నుల బియ్యం పేరుకుపోయాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బాస్మతి ధరలు ఒక్కసారిగా 10 శాతం వరకు పడిపోయాయి.
Read also: Andhra Pradesh: మద్యం విక్రయాల్లో డిజిటల్ విప్లవం: కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్!

Iran Israel War: Basmati rice prices fall
చిక్కుకున్న బియ్యం నిల్వలు
సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఎగుమతి కావాల్సిన సరుకు ఓడరేవుల్లోనే ఆగిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఇరాన్‌కు దాదాపు 6,374 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఆందోళనలో అన్నదాతలు
భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యంలో సింహభాగం గల్ఫ్ దేశాలకే వెళ్తుంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల కొత్త ఆర్డర్లు రాకపోవడం, ఉన్న నిల్వలు అమ్ముడుపోకపోవడంతో మార్కెట్ డల్ అయిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బాస్మతి సాగు చేసే రైతులపై ఆర్థిక ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: