हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట!

Sudha
artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట!

మానవ జీవితంలోని ఎన్నో అంశాల్లోకి వచ్చిన కృత్రిమ మేధ పరిశ్రమల నుంచి వైద్యరంగం వరకు ప్రతి రంగంలో మార్పు తీసుకొస్తోంది. ఈనూతన సాంకేతిక శక్తి ఇప్పుడు వ్యవసాయాన్ని కొత్త దిశగా నడిపిస్తోంది. భవిష్యత్ సాగు వాతావరణ అంచనాలపై ఆధారపడే సంప్రదాయ విధానాన్ని దాటి, సమాచార ఆధారిత నిర్ణయాల దిశగా పయనిస్తోంది. రైతు చేతిలోని గొడ్డలి, గొయ్యి పక్కనే ఇప్పుడు డేటా విశ్లేషణ, ఉపగ్రహ చిత్రాలు, నేల సెన్సర్లు చోటు దక్కించుకుంటున్నాయి. భారతదేశంలో వ్యవసాయం కేవలం వృత్తి కాదు. ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. దేశ జనాభా లో సగానికి పైగా ప్రజలు నేరుగా లేదా పరోక్షంగా ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ, వాతావరణ మార్పులు, నీటి కొరత, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, మార్కెట్ ధరల అస్థిరత రైతును అనిశ్చిత భవిష్యత్తు వైపు నెడుతున్నాయి. ఈ సవాళ్ల మధ్య కృత్రిమ మేధ (artificial intelligence)రైతుకు భరోసా కలిగించే శక్తిగా అవతరిస్తోంది. ఆధునిక పరిశోధ నలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పాదకతలో సగా నికి పైగా ప్రభావం నేల
ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుం దని. అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థఅధ్యయనాల ప్రకారం సమతుల్య పోషకాల వినియోగం ద్వారా 20నుంచి 35 శాతం వరకు దిగుబడి పెరుగుదల సాధ్యమవుతుందని వెల్లడైంది. కృత్రిమ మేధ (artificial intelligence)ఆధారిత వ్యవస్థలు నేల, తేమ, ఆమ్లత్వం, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి మూల కాలను విశ్లేషించి పంటకు సరైన సిఫార్సులు ఇస్తాయి. అవ సరమైన ఎరువులను మాత్రమే సూచించడంవల్ల
ఖర్చు తగ్గ డమే కాకుండా నేల దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది. దీర్ఘకాలికంగా ఇది సుస్థిర సాగుకు దారి తీస్తుంది. ఇటీవలి సంవత్సరాల్లో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

Read Also : AI Monitoring: పని మనిషి దొంగతనాన్ని యజమానికి తెలిపిన AI

artificial intelligence
artificial intelligence

భారత వాతావరణ పరిశోధనా సంస్థల అధ్య యనాల ప్రకారం గత రెండు దశాబ్దాల్లో అనిశ్చిత వర్షపా తం ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఉపగ్రహ చిత్రాలు, చారిత్రక వాతావరణ గణాంకాలు, ప్రస్తుత ఉష్ణోగ్రత నమూనాలను విశ్లేషించే కృత్రిమ మేధ పద్ధతులు 80నుంచి 90 శాతం వరకు ఖచ్చితత్వంతో స్వల్పకాలిక అంచనాలు ఇవ్వగలవని పరిశోధనలు సూచిస్తున్నాయి.ముందస్తు హెచ్చరికలతో రైతు పంటను రక్షించుకోవచ్చు. విపత్తుల తర్వాత నష్టాన్ని అంచనా వేయడంలో కూడా ఈ సాంకేతికత ప్రభు త్వాలకు సహకరిస్తోంది. నీటి యాజమాన్యంలో ఇజ్రాయిల్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అక్కడ తేమ సెన్సర్లు, నియంత్రిత నీటి సరఫరా విధానాలునీటి వినియోగాన్ని 40శాతం వరకు తగ్గించాయి. భారతదేశంలో కూడా తక్కు వ ఖర్చుతో పనిచేసే సెన్సర్లు నేల తేమను కొలిచి అవసర మైనప్పుడు మాత్రమే నీరు అందించే విధంగా పనిచేస్తున్నా యి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధనల ప్రకారం ఇలాంటి సాంకేతిక పద్ధతులు నీటి వినియోగాన్ని 25 నుంచి 30శాతం వరకు తగ్గించగలవు. ఇది నీటి సంక్షోభాన్ని ఎదు ర్కొనే దిశగా కీలక అడుగు. చిత్ర విశ్లేషణ ఆధారంగా పనిచేసే కకృత్రిమ మేధ పద్ధతులు మొక్కల ఆకుల రంగు, ఆకృతి మార్పులను గుర్తించి తెగుళ్లను ముందుగానే గుర్తించగలవు. అంతర్జాతీయ పరిశోధనలుతెలిపినదేమిటంటే, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించడం వల్ల 30 నుంచి 50 శాతం వరకు నష్టం తగ్గించవచ్చని. రసాయనాల వినియోగంనియంత్రితంగా ఉండడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

artificial intelligence
artificial intelligence

నేల సూక్ష్మజీవాల సమతుల్యత కాపాడబడు తుంది. రైతు ఖర్చు కూడా తగ్గుతుంది. పంటకు సరైనధర లభించకపోవడం రైతు ప్రధాన సమస్య. గణాంక విశ్లేషణ ఆధారంగా పనిచేసే కృత్రిమ మేధ పద్ధతులు గిరాకీ, సరఫరా, అంతర్జాతీయ ధోరణులను విశ్లేషించి ధరల అంచనా లు ఇస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, చైనా వంటి దేశాల్లో రైతులు ఈసమాచారాన్ని ఆధారంగా తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతదేశంలో మైక్రో సాఫ్ట్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సంయుక్తంగానిర్వహిం చిన రిసెర్చ్ మహారాష్ట్రలోని బారామతిలో చెరకు దిగు బడి గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. ఇది సాంకేతికత సరైన విధంగా అమలుచేస్తే లాభాలు ఎలా సాధ్యమవుతా యో చూపిస్తుంది. సాంకేతికతను రైతు గడపకు చేర్చడం ప్రభుత్వ బాధ్యత. శిక్షణ, అవగాహనకార్యక్రమాలు, సబ్సి డీలు అవసరం. సుస్థిర సాగు కోసం జాతీయ కార్యక్రమం, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు పునాది వేశాయి. కానీవీటిని గ్రామ స్థాయిలో అమలు చేయడంలో మరింత వేగం అవసరం. ఏఐ వ్యవస్థల భద్రతా అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రైతు డేటారక్షణ, సమాచార భద్రత వంటి అంశాలు కీలకం. సరైన విధానాలు రూపొందిస్తేనే ఈ మార్పు సుస్థిరంగా నిలుస్తుంది. కృత్రిమ మేధ వ్యవసాయా నికికేవలం ఒక సాంకేతిక సాధనం మాత్రమే కాదు రైతు భవిష్యత్తుకు భరోసా. పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరిగి, ఆదా యం స్థిరపడే మార్గం ఇది. ప్రకృతిఅనిశ్చితిని ఎదుర్కొనే శక్తి రైతుకు లభిస్తుంది. భారత వ్యవసాయం సమాచార ఆధారిత దిశగా అడుగులు వేస్తేనే దేశ ఆర్థికాభివృద్ధికి బల మైనపునాది పడుతుంది. కృత్రిమ మేధతో సమృద్ధమైన భారత వ్యవసాయం. ఇది కలకాదు, కార్యరూపం దాల్చా ల్సిన అవసరం. లాభాలు పండించే కత్రిమ మేధ అన్న దాతకు ఆదాయ భరోసా, దేశానికి స్థిరాభివృద్ధి దిశ.
-మేకల కృష్ణ

Read hindi news :hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870