వేసవి డిమాండ్ కు తగిన కరెంటు సరఫరా: కె.విజయానంద్
విజయవాడ : రాష్ట్రంలో ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో దాదాపు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్కు చేరుకునే అవకాశం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. సోమవారం సచివాలయం నుండి డిస్కాముల సిఎండీలతో పాటు ట్రాన్స్కో, జెన్కో అధికారులతో వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖచ్చితమైన విద్యుత్ అంచనాల ప్రకారం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకు సంబంధించి విద్యుత్ డిమాండ్ అంచనా వేశామని, ఇందుకు సంబందించి డిస్కాముల సిఎండీలు సమగ్ర ప్రణాళికతో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Read also: GGH Vijayawada Doctor Death: డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

Andhra Pradesh Electricity: There are no problems in power supply
వేసవి విద్యుత్ ప్రణాళిక ప్రకారం అవసరమైన విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ఉత్పత్తి, అందుబాటులో ఉండే విద్యుత్, తదితర అంశాలను ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ఉత్పత్తిని గరిష్టంగా వినియోగించాలని 247 నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సగటున 264.65 లీగీ రోజుకు గ్రిడ్ డిమాండ్ ను అందుకుంటోందని, సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 9.15 వృద్ధి నమోదు చేసినట్లు కె విజయానంద్ తెలిపారు. ఏ పీ విభజన తర్వాత అత్యధిక వినియోగాన్ని ఈ 3 75 274.6 2,14,011 యూపీక్ డిమాండ్ కు చేరుకొని ఆల్ టైం రికార్డు నమోదయిందని తెలిపారు.
గత నెల చివరి 10 రోజుల్లో అకస్మాత్తుగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో అదనపు విద్యుత్ అవసరమయ్యిందని, మార్చి, ఏప్రిల్ 2026లో పీక్ డిమాండ్ 14,500 ఎం యూ కి, కనిష్ట డిమాండ్ సుమారు 9,000 ఎం యూ కి చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరా కు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. థర్మల్, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని నిరంతరంగా పర్యవేక్షించాలని డామ్ మార్కెట్, ఆర్టీమ్ నుండి విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజయానంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీడీఎల్సి సీఎం డి. ఎల్. శివశంకర్, ఏపీ ఈ డి ఎల్ సి సిఎండి ఐ. పృథ్వీ తేజ్, ఇన్ చార్జి పి.పుల్లారెడ్డి, ఏ పీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: