డిజిటల్ యుగంలో ప్రపంచం దగ్గరవుతోంది. కానీ మానవత్వం దూరమవుతోంది. సాంకేతిక విప్లవం మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, అదే సాంకేతికతను అడ్డం పెట్టుకుని మానవ అక్రమ రవాణా (human trafficking) ముఠాలు అమా యకుల జీవితాలను చీకటిలోకి నెట్టేస్తున్నాయి. మహిళలను వ్యభిచారబారిన, చిన్నారులను వెట్టిచాకిరి బారిన, పేదలనునిర్బంధ శ్రమ బారినపడేస్తూ అంతర్జాతీయ స్థాయిలో నేర జాడలు విస్తరిస్తున్నాయి. అవయవాల అక్రమ వ్యాపారం ఈ దందాకు మరింత క్రూరత్వాన్ని జోడిస్తోంది. ఈ కొత్త తరహా నేరాన్ని పాత పద్ధతులతో ఎదుర్కోలేం. నేరగాళ్లు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తున్న ఈ కాలంలో, అదే కృత్రిమ మేధను సమాజ రక్షణకు ఆయుధంగా మల చాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది. మహిళలను వ్యభి చారానికి, బాలలను వెట్టిచాకిరికి, పేదలను నిర్బంధ శ్రమకు గురిచేస్తూ దారుణాలు సృష్టిస్తున్నాయి. అవయవాల అక్రమ వ్యాపారం ఈ చీకటి ప్రపంచానికి మరింత బలాన్నిస్తోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ గణాంకాలు ఈ విపత్తు తీవ్రతను చూపిస్తున్నాయి. 2023లో 2,183 కేసులు నమోదై 6,288 మంది బాధితులుగా గుర్తించబడ్డారు. వీరిలో 42 శాతానికి పైగా మైనర్లే. 2018 నుంచి 2022 మధ్య నమోదైన వేల కేసుల్లో అరెస్టులు జరిగినా శిక్షల శాతం అత్యల్పం. నేరం వేగంగా మారుతున్నా చట్టపరమైన వ్యవస్థ మాత్రం అంతే వేగంతో మారలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2026 చివరి నాటికి కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ఈనేపథ్యంలో కృత్రిమ మేధఒక శక్తివంతమైన ఆయుధంగా మారవచ్చు. సామా జిక మాధ్యమాలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ వేదికలను వినియోగిస్తూ నేరగాళ్లు తమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే డిజిటల్ ప్రపంచంలో కృత్రిమ మేధను వినియోగించి నేరాలను ముందుగానే పసిగట్టడం సాధ్యం. రియల్ టైమ్ విశ్లేషణ, నమూనాలు గుర్తింపు వంటి పద్ధతులతో అనుమా నాస్పద కదలికలను గుర్తించవచ్చు. లక్షల ప్రకటనలను క్షణాల్లో స్కాన్ చేసి అనుచిత పదజాలం, చిత్రాలను గుర్తించడం ద్వారా అధికారులను అప్రమత్తం చేయవచ్చు.
Read Also : War Effect: శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు 12 విమానాలు రద్దు

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వంటి రవాణా కేంద్రాలు అక్రమ రవాణాదారుల(human trafficking) ప్రధాన మార్గాలు. అక్కడ ఏర్పాటు చేసే సీసీటీవీ కెమేరా లను కృత్రిమ మేధతో అనుసంధానిస్తే అదృశ్యులైన బాధితులను, రికార్డులకెక్కిన నేరగాళ్లను గుర్తించడం సులభమవు తుంది. ముఖగుర్తింపు సాంకేతికత, ప్రవర్తన విశ్లేషణ పద్ధతు లు బాధితులను రక్షించడంలో తోడ్పడగలవు. అమెరికా, కెనడా, ఐరోపాదేశాలు వినియోగిస్తున్న ఆధునిక పద్ధతులను భారతదేశం కూడా స్వీకరించాలి. అంతర్జాతీయ సహకారం పెంపొందించాలి. పెండింగులో ఉన్నమానవ అక్రమ రవాణా నిరోధచట్టానికి రూపంఇవ్వాలి. వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు సూచ నలను కార్యరూపం దాల్చాలి. అయితే కృత్రిమమేధ వినియోగం గోప్యత, మానవ హక్కుల పరిరక్షణకు భంగం కలిగించ కూడదు. డేటా సేకరణలో పక్షపాతం చోటుచేసుకోకూడదు. ముఖగుర్తింపు సాంకేతికతలు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నియంత్రణ అవసరం. నేరగాళ్లు కూడా కృత్రిమ మేధను వాడుతున్న ఈకాలంలో పోలీసు, భద్రతా సంస్థల కు నిరంతర శిక్షణ, సరిపడ నిధులు అత్యవసరం. సాంకేతికత స్వయంగా మంచిదో కాదోకాదు, ఏఐని ఎలా వినియోగిస్తా మన్నదే కీలకం. బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఎఐ మేధను బాధ్యతాయుతంగా వినియోగించి, మానవ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు సమగ్ర పోరాటం అవసరం. చట్టం, సాంకేతికత, సమాజం ఈమూడు కలిసివచ్చినప్పుడే ఈ చీకటి వ్యాపారానికి ముగింపు పలకగలం.
-ఈ. శ్రీనివాస్ రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: