हिन्दी | Epaper

Afghanistan: పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘాన్ వైమానిక దాడులు

Vanipushpa
Afghanistan: పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘాన్ వైమానిక దాడులు

పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం దాడులు నిర్వహించిందని ఆప్ఘనిస్థాన్(Afghanistan) రక్షణ శాఖ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైంది. దీనిని పాకిస్థాన్ రిపేర్ చేసుకుంటోంది. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ ఆ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Read Also: India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

Afghan airstrikes on Pakistani military bases
Afghan airstrikes on Pakistani military bases

ఈ క్రమంలో పాక్ కీలక సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించిందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ సైనిక చొరబాట్లకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870