हिन्दी | Epaper

Dolphins: కొంక‌ణ్ తీరంలో క‌నువిందు చేసిన 75 డాల్ఫిన్లు

Vanipushpa
Dolphins: కొంక‌ణ్ తీరంలో క‌నువిందు చేసిన 75 డాల్ఫిన్లు

పశ్చిమ కనుమలు, అరేబియా సముద్ర తీర ప్రాంతం మధ్య విస్తరించిన అందమైన ప్రదేశం కొంకణ్ (Konkan). నిత్యం ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. అక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను చూసి మైమ‌ర‌చిపోతుంటారు. తాజాగా కొంక‌ణ్ తీర ప్రాంతంలో ప‌ర్యాట‌కుల‌కు ఓ అరుదైన దృశ్యం క‌నువిందు చేసింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ (Sindhudurg) జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరం (Konkan coast)లో ప‌ర్యాట‌కుల‌కు డాల్ఫిన్ల (Dolphins) గుంపు క‌నువిందు చేసింది. దేవ్‌బాగ్‌ – తార్కర్లీ బీచ్‌ సమీపాన సముద్రంలో దాదాపు 70 నుంచి 75 డాల్ఫిన్లు ఈదుతూ కనిపించాయి. ఒకేచోట అన్ని డాల్ఫిన్లు క‌నిపించ‌డంతో ప‌ర్యాట‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాదు, నిత్యం చేప‌ల వేట‌కోసం స‌ముద్ర జ‌లాల్లో సంచ‌రించే మ‌త్స్య‌కారులు సైతం ఈ అరుదైన దృష్యాన్ని చూసి న‌మ్మ‌లేక‌పోయారు. ఇంత పెద్ద సంఖ్య‌లో డాల్ఫిన్లు ఒకేచోట క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి అని వారు పేర్కొన్నారు.

Read Also: Rajya Sabha Elections 2026: తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

Dolphins: కొంక‌ణ్ తీరంలో క‌నువిందు చేసిన 75 డాల్ఫిన్లు
Dolphins: కొంక‌ణ్ తీరంలో క‌నువిందు చేసిన 75 డాల్ఫిన్లు

డాల్ఫిన్లు స్విమ్ చేస్తున్న దృశ్యాల‌ను సముద్ర జీవ శాస్త్రవేత్త విశాల్‌ భావే (Vishal Bhave) డ్రోన్ సాయంతో చిత్రీక‌రించారు. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు, ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది అరుదైన దృశ్యంగా పేర్కొంటున్నారు. కాగా, సింధుదుర్గ్, రత్నగిరి తీర ప్రాంతాలు డాల్ఫిన్ల ఆవాసాలుగా ప్రసిద్ధి. ఇక్క‌డ డాల్ఫిన్లు క‌నువిందు చేస్తుంటాయి. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో డాల్ఫిన్లు స్విమ్ చేస్తూ క‌నిపించ‌డం ఇదే తొలిసారి. ఈ డాల్ఫిన్లు హిందూ మహాసముద్రంలోని హంప్‌బ్యాక్ జాతికి (Humpback Dolphins) చెందిన‌విగా నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

📢 For Advertisement Booking: 98481 12870