Special meeting of Telangana Assembly today

ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

హైదరాబాద్‌: ఒక రోజు ముందుగానే అంటే రేపు (మంగళవారం) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్‌కు అందజేస్తారు.

Advertisements

కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్కరోజులోనే ముగించనున్నారు.

image

కాగా, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ ప్రసంగం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అనంతరం 17న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఒకట్రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, సభను వాయిదా వేస్తారని, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలిసింది.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

Related Posts
రాబోయే మూడు రోజులు జాగ్రత్త
summer

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల Read more

కేటీఆర్‌ పై ఏసీబీ కేసు నమోదు
KTR responded to ED notices

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ Read more

మోడీ , రేవంత్ లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ktr modi

ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా Read more

రేపు జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు
Appointment letters

ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన 1,286 మంది జూనియర్ లెక్చరర్లకు (JL) Read more

Advertisements
×