JayaBachan : టాయిలెట్‌ - ఏక్‌ ప్రేమ్‌కథ చిత్రం పై జయాబచ్చన్ కామెంట్స్ వైరల్!

JayaBachan : టాయిలెట్‌ – ఏక్‌ ప్రేమ్‌కథ చిత్రం పై జయాబచ్చన్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య, ఎంపీ జయా బచ్చన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హిందీ సినీ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితమే కాకుండా, అవార్డ్స్ ఫంక్షన్లు, రాజకీయ వేదికల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన పేరు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన జయా బచ్చన్, తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెట్టడం విశేషం.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయా బచ్చన్, ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. “ఛీ ఛీ.. అదేం పేరు! నిజంగా అది కూడా ఒక పేరేనా?” అంటూ ఆమె కామెంట్ చేశారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్ అయినా, తన దృష్టిలో ఆ సినిమా మాత్రం ఫ్లాప్ అని చెప్పారు.

Advertisements

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్‌ – ఏక్‌ ప్రేమ్‌కథ’ చిత్రం. శ్రీ నారాయణ్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్‌ హీరోయిన్ గా నటించింది. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 300 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని మరుగుదొడ్ల సమస్యను ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త ఏం చేశాడు ? అనేది ఈ సినిమా స్టోరీ.

టైటిల్ నచ్చకపోతే సినిమా చూడను!

నా దృష్టిలో మాత్రం ఫ్లాప్‌ మూవీనే అని జయా బచ్చన్‌ కామెంట్స్ చేశారు. అయితే అందుకు గల కారణాన్ని సైతం బయటపెట్టారు జయాబచ్చన్. తనకు సినిమాలు చూసే విషయంలో ఒక కండిషన్ ఉంటుందని తెలిపారు.ఆ నియమం కారణంగానే ఆ చిత్రం చూడలేదని చెప్పారు. సినిమాలు చూసే విషయంలో తాను కొన్ని కండీషన్స్‌ పెట్టుకున్నానని స్పష్టం చేశారు. టైటిల్‌ నచ్చకపోతే సినిమా చూడనని తేల్చి చెప్పారు. ఒక్కసారి ఆ టైటిల్‌ చూడండి,అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకే అది బ్లాక్‌ బస్టర్‌ మూవీ అయినాబాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లు కొల్లగొట్టినా కానీఆ చిత్రం అంటే తనకు నచ్చదని మొహమాటం లేకుండా చెప్పేశారు. తన దృష్టిలో అదొక ఫ్లాప్‌ చిత్రమని అన్నారు.

Related Posts
ఢిల్లీలో మరింత క్షీణించిన గాలినాణ్యత
Air quality worsens in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి తరువాత గాలినాణ్యత మరింత పడిపోయింది. పొగమేఘాలు ఆకాశాన్ని కప్పేసి, ప్రజలు విషపూరిత గాలిని పీలుస్తున్నారు. దీపావళికి బాణసంచా కాల్చవద్దని అనేక Read more

Rajnath : గట్టి బదులు చెబుతాం
Rajnath : గట్టి బదులు చెబుతాం

పహల్గాం దాడిపై రాజ్ నాథ్ స్పందన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం Read more

కన్నప్ప సినిమా లో రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన ప్రభాస్ ?
కన్నప్ప సినిమా లో రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన ప్రభాస్ ?

ప్రభాస్ తాజా చిత్రం "కన్నప్ప"లో రుద్రుడిగా నటిస్తున్న విషయం ప్రస్తుతం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ఒక రూపాయి కూడా Read more

మూడోరోజు భారీగా నష్టపోయిన మార్కెట్లు
మూడోరోజు భారీగా నష్టపోయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, చైనా ఆర్థిక Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×