Today the new government will be formed in Maharashtra. Who will be the future CM

నేడు మహారాష్ట్రలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..కాబోయే సీఎం ఎవరు?

ముంబయి : మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది. సోమవారం మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు నెగ్గి విజయాన్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్‌ ఫిగర్‌ కాగా, బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.

కాగా, సీఎం పదవిపై కూటమిలోని మూడు పార్టీల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారని ఫడ్నవీస్‌ సైతం స్పష్టం చేశారు. ‘మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమిని నమ్మి అధికారం కట్టబెట్టారు. వారి తీర్పు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. కలిసి పోటీ చేసి విజయం సాధించిన మేము ఇప్పుడు సీఎం పదవి కోసం ఎలాంటి వివాదాలకు తావివ్వం. దీనిపై కూడా అందరూ కలిసికట్టుగానే నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా మిగిలిన అందరం దానిని శిరోధార్యంగా భావిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము 100కు పైగా సీట్లను సాధించామని చెప్పి కూటమిలోని పార్టీలను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే స్పష్టం చేశారు.

ఇక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని శివసేనకు చెందిన మంత్రి దీపక్‌ కేసర్కర్‌ తెలిపారు. తొలి విడుతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు వీరు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, శివసేన (షిండే) పార్టీ నుంచి 12, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.

Related Posts
నేడు ఈడీ విచారణకు కేటీఆర్
ktr tweet

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలపై కొత్త పరిణామం ఎదురవుతోంది. ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరుకానున్నారు. ఆయన Read more

వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
Hearing on Vallabhaneni Vamsi bail petition postponed

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను Read more

Mumtaz Hotels : తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా
Swamiji's dharna

తిరుపతిలో హిందూ స్వామిజీలు, ధార్మిక సంఘాలు ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన చేపట్టారు. ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హోటల్ ప్రాజెక్ట్ భక్తుల Read more

పుచ్చకాయపై రేవంత్ రెడ్డి చిత్రం..కళాకారుడి అద్భుతం
revanth fan

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన కళాకారుడు సంతోష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పుచ్చకాయపై అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాడు. ఈ ప్రత్యేక కళా కృతిలో, వాటర్ Read more