Today rulers are worse than the British.. Kejriwal

Kejriwal: నేటి పాలకులు బ్రిటిష్ కంటే దారుణంగా ఉన్నారు: కేజ్రీవాల్

Kejriwal: బీజేపీపై మరోసారి ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌, సంఘ సంస్కర్త అంబేడ్కర్‌ వారసత్వాన్ని కాషాయపార్టీ విస్మరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు బ్రిటిష్‌ వాళ్ల కంటే దారుణంగా ఉందన్నారు. ‘ఏక్‌ శామ్‌ షహీదోంకే నామ్‌’ పేరుతో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కేజ్రీవాల్‌.. తమ పార్టీ మాత్రం భగత్‌సింగ్‌, అంబేడ్కర్‌ల ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చిందన్నారు.

నేటి పాలకులు బ్రిటిష్ కంటే

గాంధీజీ చిత్రపటం లేదు

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, భగత్‌ సింగ్‌లు మాకు ఆదర్శం. మా కార్యాలయంతోపాటు పంజాబ్‌లోని ప్రతి ఆఫీసులో వారి ఫొటోలే ఉంటాయి. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఫొటోలను తొలగించి వారికి నచ్చిన వాళ్లవి పెట్టుకున్నారు. గాంధీజీ చిత్రపటం లేదని విమర్శించిన కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు మౌనంగా ఉంది. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రస్తుత పాలకులు బ్రిటిష్‌ కంటే దారుణంగా ఉన్నారని మండిపడ్డారు.

ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సింది

ఢిల్లీలో బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకుంటే కండక్టర్లు పింక్‌ టికెట్‌ ఇవ్వడం లేదన్నారు. సౌకర్యాలు కల్పించకపోగా.. గతంలో ఉన్న వాటిని ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సి ఉందని, కానీ ఇంకా ఆ కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Related Posts
సర్కారులో చలనం వచ్చింది: కేటీఆర్‌
KTR Congress

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో మండిపడ్డారు. గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, Read more

భాషను తక్కువగా అంచనా వేయొద్దు – కమల్ హాసన్
భాషను తక్కువగా అంచనా వేయొద్దు - కమల్ హాసన్

తమిళనాడులో పీఎం శ్రీ స్కూళ్ల పేరుతో హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ యత్నాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు అన్ని రాజకీయ Read more

సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్
samsung

ఒక పూట ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా అవుతుంది. మన బలహీనతల్ని ఆసరాచేసుకుని పలు కంపనీన్లు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. Read more

బెంగళూరు జీవనంపై హర్ష గోయెంకా సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు జీవనంపై హర్ష గోయెంకా సంచలన వ్యాఖ్యలు

ఆర్ఎల్పీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా బెంగుళూరులో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఒక పెద్ద చర్చకు దారితీశారు. నగరం ఒకప్పుడు ప్రశాంతమైన నగరంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *