KTR Congress

సర్కారులో చలనం వచ్చింది: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో మండిపడ్డారు. గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం విద్యార్థులను ఆసుపత్రి మెట్లు ఎక్కించిందని కేటీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభంగా మార్చేశారని విమర్శించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడంలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కల్పించుకుని గురుకులాల బాట పట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చిందని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఏడాది పాలనలో సామాన్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో భయాందోళనలు నింపిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు.. అన్నట్లు పాలకులు ఇప్పుడు గురుకులాలను సందర్శించడం మొదలుపెట్టారని చెప్పారు. నామమాత్రంగా సందర్శించి, ఫొటోలు దిగి రాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెమెరాల ముందు హడావుడి చేయడంతో సరిపెట్టకుండా గురుకులాల బిడ్డల గుండె చప్పుడు వినాలని, గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.

Related Posts
ఫిబ్రవరి 4వ తేదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం !
CM Revanth Reddy's key decision on February 4!

ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజికన్యాయ దినోత్సవం హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ Read more

తెలంగాణ లో కొనసాగుతున్న గ్రూప్ 3 పరీక్షలు
group 3 exams

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు Read more

Acid:హోలీ పేరుతో యాసిడ్ తో దాడి ఎక్కడంటే?
Acid:హోలీ పేరుతో యాసిడ్ తో దాడి ఎక్కడంటే?

హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ రోజున భయానక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న భూలక్ష్మీ మాతా ఆలయంలో పనిచేస్తున్న అకౌంటెంట్‌పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ Read more

రైతులకు శుభవార్త తెలిపిన RBI
RBI gives good news to farm

రైతులకు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త అందించింది. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే వ్యవసాయ రుణాల పరిమితిని 1.6 లక్షల Read more