రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6-11 గంటల వరకు ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా 25న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24న ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది.

Advertisements
రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

అనంత‌రం భక్తులను దర్శనం

ఇక, ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల

కాగా, ఈ నెల(మార్చి) 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కారణంగా 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం రేపటి(సోమవారం) నుంచి అమ‌లులోకి రానుందని టీటీడీ తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌డం జ‌రుగుతుందని పేర్కొంది.

Related Posts
HYD Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ షాక్
Hyderabad Metro fares hiked!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల పెంపు రూపంలో ఊహించని భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ Read more

Chebrolu Kiran: జగన్ భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్
వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త అరెస్ట్

జగన్ భార్య వైఎస్ భారతి పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ Read more

ఆంధ్రాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు-భువనేశ్వరిని ప్రశంసించిన చంద్రబాబు
ఆంధ్రాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల-భువనేశ్వరిని ప్రశంసించిన చంద్రబాబు

నారా భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విజయవాడ కేంద్రంగా తన సేవలను మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో నేడు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి Read more

కౌశిక్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కోసం వస్తామని చెప్పి రాలేదేంటి ..కాంగ్రెస్ ప్రశ్న
paadi koushik

డ్రగ్స్ పరీక్షల అంశంపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ బల్మూరి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×