Today rulers are worse than the British.. Kejriwal

Kejriwal: నేటి పాలకులు బ్రిటిష్ కంటే దారుణంగా ఉన్నారు: కేజ్రీవాల్

Kejriwal: బీజేపీపై మరోసారి ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌, సంఘ సంస్కర్త అంబేడ్కర్‌ వారసత్వాన్ని కాషాయపార్టీ విస్మరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు బ్రిటిష్‌ వాళ్ల కంటే దారుణంగా ఉందన్నారు. ‘ఏక్‌ శామ్‌ షహీదోంకే నామ్‌’ పేరుతో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కేజ్రీవాల్‌.. తమ పార్టీ మాత్రం భగత్‌సింగ్‌, అంబేడ్కర్‌ల ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చిందన్నారు.

Advertisements
నేటి పాలకులు బ్రిటిష్ కంటే

గాంధీజీ చిత్రపటం లేదు

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, భగత్‌ సింగ్‌లు మాకు ఆదర్శం. మా కార్యాలయంతోపాటు పంజాబ్‌లోని ప్రతి ఆఫీసులో వారి ఫొటోలే ఉంటాయి. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఫొటోలను తొలగించి వారికి నచ్చిన వాళ్లవి పెట్టుకున్నారు. గాంధీజీ చిత్రపటం లేదని విమర్శించిన కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు మౌనంగా ఉంది. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి అని కేజ్రీవాల్‌ ఆరోపించారు. బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రస్తుత పాలకులు బ్రిటిష్‌ కంటే దారుణంగా ఉన్నారని మండిపడ్డారు.

ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సింది

ఢిల్లీలో బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకుంటే కండక్టర్లు పింక్‌ టికెట్‌ ఇవ్వడం లేదన్నారు. సౌకర్యాలు కల్పించకపోగా.. గతంలో ఉన్న వాటిని ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే మహిళలకు రూ.2500 ఇవ్వాల్సి ఉందని, కానీ ఇంకా ఆ కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Related Posts
నవంబర్‌ 6న ఏపీ కేబినెట్ భేటీ
ap cabinet meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ నవంబర్ 6న ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై Read more

సుజ్లాన్ గ్రీన్ స్కిల్ ప్రోగ్రామ్
Suzlan and Andhra Pradesh join hands for Green Skill Programme

భారతదేశం యొక్క అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు పునాది వేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసాయి. ఇది 12,000 మంది ట్రైనీలకు సాధికారత కల్పించడం Read more

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు
వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గతం: నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు Read more

Shahid: జట్టు మొదటి స్థానంలో నిలవడంతో కోటీశ్వరుడిగా మారిన షాహిద్
Shahid : జట్టు మొదటి స్థానంలో నిలవడంతో కోటీశ్వరుడిగా మారిన షాహిద్

తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షాహిద్‌ అనే వ్యక్తి జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. ఓ సాధారణ దర్జీగా జీవనం సాగిస్తూ, చిన్న చిన్న ఆశయాలతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×