Today, India is the mastermind behind the Mumbai attacks!

Tahawwur Rana : నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!

Tahawwur Rana: అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావుర్ హుస్సేన్ రాణాను నేడు భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 10) అతను భారత్‌కు చేరుకుంటాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తహావుర్ అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిపోవడంతో ఇండియాకు తీసుకొస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన రాణా ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే, 2008లో నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి సుమారు 166 మందిని చంపేశారు.

Advertisements
నేడు భారత్‌కు ముంబై దాడుల

ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా

పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రాణా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో చురుకైన పాత్ర పోషించాడు. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయాణ పత్రాలు సులభంగా ఇప్పించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. అనంతరం పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్, వ్యూహాత్మక మద్దతుతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు.

అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ

ముంబై ఉగ్రదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. విచారణ అనంతరం అతడిని ఉరితీశారు. కాగా, ఈ దాడుల వెనుక సూత్రధారి రాణాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది. అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. రాణా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. తనను భారత్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ తహావుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు.

Related Posts
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ స్పందన

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందడం అందరినీ విషాదంలో ముంచేసింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, Read more

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి
Padmakar Shivalkar

ముంబై క్రికెట్ లో చిరస్మరణీయ ఆటగాడిగా నిలిచిన లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (84) మృతి చెందారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. భారత క్రికెట్ Read more

మైనర్‌ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు
women

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకునిపోతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఈ రంగం ఆ రంగం అని కాదు, దాదాపు అన్నిరంగాల్లో ఈ వేధింపులకు గురి Read more

గాజాలో జర్నలిస్టులపై ఇజ్రాయెల్ వైమానిక దాడి..
gaza journalist

పాలస్తీనా అధికారులు మరియు మీడియా నివేదికల ప్రకారం, గాజా ప్రాంతంలోని సెంట్రల్ ప్రాంతంలో ఐదు జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అల్-అవ్దా హాస్పిటల్ సమీపంలో చోటుచేసుకుంది. జర్నలిస్టులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×