భారతదేశంలో బంగారం ధరలు స్థిరంగా ₹1.3 లక్షల వద్ద! దీపావళి తర్వాత మళ్లీ పెరుగుతాయా? – అక్టోబర్ 22 అంచనా
Today Gold Rate 21/10/25 : భారతదేశంలో దీపావళి సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా, మొత్తం మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం ధర ₹1,30,690, 22 క్యారెట్ ధర ₹1,19,800 వద్ద కొనసాగుతుంది. (Today Gold Rate 21/10/25) వెండి ధర కూడా ₹172 గ్రాము వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కొత్త రికార్డును తాకడంతో, దీపావళి తర్వాత భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
2025లో బంగారం ధరలు ఇప్పటికే 60% పెరిగాయి. జియోపాలిటికల్ రిస్క్స్, ఆర్థిక మందగమనం, మరియు పెట్టుబడిదారుల పెరిగిన కొనుగోళ్లు బంగారానికి బలాన్ని ఇచ్చాయి. వెండి కూడా పరిశ్రమల డిమాండ్ పెరగడంతో బలంగా నిలుస్తోంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, ఇటీవల జరిగిన ధర తగ్గుదల “Buy on Dips” అవకాశమని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో గత 10 రోజుల బంగారం ధరలు (1 గ్రాము)
| తేదీ | 24 క్యారెట్ బంగారం ధర | మార్పు | 22 క్యారెట్ బంగారం ధర | మార్పు |
|---|---|---|---|---|
| అక్టోబర్ 21, 2025 | ₹13,277 | +₹208 | ₹12,170 | +₹190 |
| అక్టోబర్ 20, 2025 | ₹13,069 | -₹17 | ₹11,980 | -₹15 |
| అక్టోబర్ 19, 2025 | ₹13,086 | 0 | ₹11,995 | 0 |
| అక్టోబర్ 18, 2025 | ₹13,086 | -₹191 | ₹11,995 | -₹175 |
| అక్టోబర్ 17, 2025 | ₹13,277 | +₹333 | ₹12,170 | +₹305 |
| అక్టోబర్ 16, 2025 | ₹12,944 | 0 | ₹11,865 | 0 |
| అక్టోబర్ 15, 2025 | ₹12,944 | +₹109 | ₹11,865 | +₹100 |
| అక్టోబర్ 14, 2025 | ₹12,835 | +₹295 | ₹11,765 | +₹270 |
| అక్టోబర్ 13, 2025 | ₹12,540 | +₹32 | ₹11,495 | +₹30 |
| అక్టోబర్ 12, 2025 | ₹12,508 | 0 | ₹11,465 | 0 |
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :