Gold rate India : మార్చి 3న బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి రేట్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 2 వేలకుపైగా పడిపోవడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2,350 తగ్గి తులం రూ. 1,56,300 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 2,580 తగ్గి 10 గ్రాములకు రూ. 1,70,510కు చేరింది. గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు కొంత తగ్గడంతో పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలు చేసేవారికి ఇది అనుకూల పరిణామంగా భావిస్తున్నారు.
Read Also: Trump Iran war : ఇరాన్‌పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌పై అమెరికాలో రాజకీయ వివాదం

వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 10,000 తగ్గి ప్రస్తుతం రూ. 3.15 లక్షల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5,400 డాలర్లను దాటిన తర్వాత తిరిగి 5,330 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ రేటు 95 డాలర్ల నుంచి 88 డాలర్లకు దిగివచ్చింది.
అంతర్జాతీయ అనిశ్చితి, ముడి చమురు ధరల మార్పులు, పెట్టుబడిదారుల వ్యూహాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత మార్కెట్ ధోరణిని బట్టి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: