Gold Rate Today : పసిడి ప్రియులకు ఈరోజు కొంత ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు పెద్దగా మార్పుల్లేకుండా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభావం పడే అవకాశముందని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు 22, 24 క్యారెట్ల బంగారం తులం ధర ఎంతుందో చూద్దాం.
Breaking News – Liquor Sale : రెండేళ్లలో తెలంగాణ లో రూ.71,500 కోట్ల మద్యం తాగేశారు..ఓరి దేవుడా !!
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన (Gold Rate Today) భావోద్వేగం ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో పసిడి తప్పనిసరిగా కావాల్సిందే. అంతేకాదు అవసర సమయంలో ఆధారంగా నిలిచే పెట్టుబడిగా కూడా చాలామంది బంగారాన్ని భావిస్తారు. అయితే 2025 ఏడాది మొత్తం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీలు, డాలర్ విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, వాణిజ్య అనిశ్చితులు వంటి అనేక అంశాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
గత రెండు రోజులుగా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు రావడంతో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిల వైపు కదులుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 1న హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి పెరిగాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ ఔన్సుకు 12 డాలర్లకుపైగా పెరిగి 4,232 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్సుకు 1.62 డాలర్లు పెరిగి 57.42 డాలర్లకు చేరింది. గత నెల రోజుల్లోనే ఔన్సు గోల్డ్ ధర దాదాపు 218 డాలర్లు పెరగడం విశేషం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/