బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు ఒడుదొడుకులకు లోనవ్వడంతో దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280 కు చేరింది. వరుసగా తగ్గుదల నమోదు కావడంతో కొనుగోలుదారుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది.
Latest News: Bigg Boss 9: పచ్చళ్ల పాప ఔట్..బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించిందంటే?
ఇక 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా పడిపోయే ధోరణి నమోదైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,150 తగ్గి రూ.1,13,000 గా ఉంది. పండుగలు, వివాహాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ తగ్గుదల వినియోగదారులకు కొంతంత మేలు చేస్తుందన్న భావన ఉంది. అయితే మార్కెట్ పరిస్థితులు స్థిరంగా లేకపోవడంతో ధరలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు నమోదు కాలేదు. కేజీ వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలు అమల్లో ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల మార్పులే బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/