Gold Rate 25/11/25 : బంగారం కొనే ఆలోచనలో ఉన్న వారికి మరోసారి శుభవార్త అందింది. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవాళ స్వల్పంగా దిగివచ్చాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం విరుద్ధ దిశలో కదలికలు కనిపించాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు పెరగడంతో అంతర్జాతీయంగా బంగారం ధర బలపడింది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున మార్పులు నమోదవుతున్న నేపథ్యంలో, ఇక్కడి ధరలు మళ్లీ తగ్గడం వినియోగదారులకు ఉత్సాహాన్నిస్తోంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4136 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది నిన్నటి కన్నా 50 డాలర్లకు పైగా ఎక్కువ. సిల్వర్ కూడా 51.42 డాలర్ల వద్ద ఉంది. అయితే రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే మరింత బలహీనపడింది.
Read Also: AP: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 650 రూపాయలు తగ్గి 1,14,690 రూపాయలకు చేరింది. అంతకుముందు రోజు భారీగా పెరిగిన ధర ఇపుడు స్థిరపడడం గమనార్హం. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా 710 రూపాయలు తగ్గి 10 గ్రాములు 1,25,130 రూపాయలకు చేరింది.
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. (Gold Rate 25/11/25 ) ఇవాళ కిలో వెండి ధర 1000 రూపాయలు తగ్గి 1.71 లక్షలుగా ఉంది. అక్టోబర్ 15న వెండి ధర 2.07 లక్షలకు చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే ప్రస్తుత ధర గణనీయంగా తక్కువే. దేశంలో బంగారం, వెండి ధరలు ప్రాంతానికీ ప్రాంతం భిన్నంగా ఉండటం సహజం. స్థానిక పన్నులు, తయారీ చార్జీలు, డిమాండ్ వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి.
బంగారు నగలు కొనుగోలు చేసే సమయంలో తుది బిల్లుపై 3% జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: