Today Congress Chalo Raj Bhavan

నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్య్రమం చేపట్టనున్నారు.

దేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళన పిలుపుతో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..ఫైర్ అయ్యారు. ముఖ్య మంత్రే రాజ్ భవన్ ముట్టడికి వెళ్తే.. రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితేంటి..? అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. సమావేశాలు తప్పించుకువడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం మనుసు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన చేయడానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు..ధర్నాలు చేయడానికి కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చురకలు అంటించారు . ఈ రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుందని ఫైర్ అయ్యారు.

Related Posts
ఎంపీ పిఎ రాఘవ రెడ్డి 41 ఏ నోటీసులు జారీ
MP PA Raghava Reddy 41 A no

పులివెందుల : సోషియల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ ల కేసులో ఎంపీ పిఏ బండి రాఘవ రెడ్డి ఇంటికి పోలీస్ లు వెళ్లి ఈనెల తొమ్మిదవ తేదిన Read more

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి భారీ ఊరట
kova lakshmi

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తన ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరట పొందారు. 2023 ఎన్నికల్లో కోవలక్ష్మి అందించిన అఫిడవిట్‌లో ఆదాయపన్ను లెక్కల్లో Read more

కోతలు, కూతలు కాదు చేతలు కావాలి: కేటీఆర్‌
ktr comments on congress government

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్‌ ఎక్స్‌ Read more

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్..త్వరలోనే గజ్వేల్లో భారీ సభ!
kcr

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటికే పరిమితమైన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) మళ్లీ Read more