cm revanth reddy district tour

నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయం 10.30కి చార్మినార్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సద్భావన యాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డి.శ్రీధర్ బాబు, డి.సీతక్క, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌బహదూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్‌ ముగింపు వేడుకలకు హాజరు కానున్నారు. చార్మినార్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తుకున పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని సూచించారు. వేరే మార్గాల ద్వారా వాహనదారులు వెళ్ళాలని తెలిపారు. చార్మినార్ వద్ద షాపుల బంద్ చేశారు.

Related Posts
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు
Four Kumbh mel

ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మరో 144 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా నలుగురు పవిత్ర నగరాల్లో Read more

మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు పునఃప్రారంభం : ఇస్రో
Spadex experiments to resume from March 15.. ISRO

ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతం న్యూఢిల్లీ: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన Read more

గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం
group2ap

గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని APPSC ని ఆదేశించింది. ఈ నెల 25వ తేదీన జరగాల్సిన Read more

నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ లో ప్ర‌స‌గించిన మంత్రి కొండా సురేఖ
నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్

నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ - 2025 🔹 మూడు రోజుల పాటు జరగనున్న జీవవైవిధ్య సదస్సునేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్ - 2025 ఫిబ్రవరి 20, 21, 22 Read more