हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

TNPL 2025: మ‌హిళా అంపైర్‌తో అశ్విన్ తీవ్ర‌ వాగ్వాదం

Sharanya
TNPL 2025: మ‌హిళా అంపైర్‌తో అశ్విన్ తీవ్ర‌ వాగ్వాదం

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025 సీజన్‌ దశలవారీగా రసవత్తరంగా సాగుతోంది. అయితే, తాజాగా జరిగిన దిండిగల్ డ్రాగన్స్ vs తిరుప్పూర్ తమిళ్‌తలైవాస్ మ్యాచ్‌లో టీమిండియా లెజెండ‌రీ స్పిన్నర్, దిండిగల్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఓ వివాదానికి కేంద్రంగా మారారు. ఈ మ్యాచ్‌లో తన ఎల్బీడబ్ల్యూ ఔట్ విషయంలో మహిళా అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన ఘటనను సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్నారు.

TNPL 2025: మ‌హిళా అంపైర్‌తో అశ్విన్ తీవ్ర‌ వాగ్వాదం

వివాదాస్పద ఔట్ – అశ్విన్ అసహనం

ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో, తిరుప్పూర్ బౌలర్ సాయి కిషోర్ వేసిన బంతికి అశ్విన్ 18 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఐపీఎల్ సీజన్‌లో నిరాశపరిచిన అశ్విన్, టీఎన్‌పీఎల్‌లో దిండిగల్ జట్టుకు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. తిరుప్పూర్ కెప్టెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అశ్విన్ (18 పరుగులు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, అంపైర్ కృతిక వెంకటేశన్ ఇచ్చిన ఈ నిర్ణయాన్ని అశ్విన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిందని, అది ఎల్బీడబ్ల్యూ కాదని అతను వాదించాడు. అంపైర్ వద్దకు వెళ్లి “మేడమ్, అతను ఓవర్ ది స్టంప్స్ నుంచి బౌలింగ్ చేశాడు” అని బంతి వెళ్లిన దిశ ప్రకారం తాను నాటౌట్ అని గట్టిగా వాదించాడు.

DRS (Decision Review System)లేకపోవడం వల్ల మిగిలిన నిరుత్సాహం

టీఎన్‌పీఎల్‌లో డీఆర్‌ఎస్ (Decision Review System) అందుబాటులో లేకపోవడంతో అశ్విన్ కు నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశమే లభించలేదు. దీంతో అతని అసహనం మరింత పెరిగింది. తీవ్ర నిరాశతో మైదానం వీడే ముందు, అశ్విన్ తన బ్యాట్‌ను ప్యాడ్స్‌కు బలంగా కొట్టుకున్నాడు. ఈ దృశ్యాలు అభిమానులను, వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో అంపైరింగ్ ప్రమాణాలు, కీలక సమయాల్లో ఆటగాళ్ల ప్రవర్తనపై విస్తృత చర్చకు దారితీసింది.

కెప్టెన్ ఔట్ – జట్టు ధ్వంసం

అశ్విన్ ఔటైన తర్వాత దిండిగల్ డ్రాగన్స్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. మొత్తం జట్టు కేవలం 93 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రత్యర్థి జట్టు తిరుప్పూర్ తమిళ్‌తలైవాస్ ఈ చిన్న లక్ష్యాన్ని సులభంగా ఛేదించి 2025 సీజన్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు, ఇది దిండిగల్ జట్టుకు మొదటి ఓటమిగా నిలిచింది.

read also: Virat Kohli : అల్కరాజ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చిన వ్యాఖ్యాతలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870