తిరుమల : ఇటీవల సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి (Man Drinks Alcohol) దృశ్యాలను తిరుమలలో జరిగినదిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ ప్రచారాన్ని టీటీడీ (Ttd Gives Clarity) పూర్తిగా ఖండిస్తోంది.
తిరుమల లో అపచారం అంటూ ఫేక్ న్యూస్ వైరల్
సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రచార యావతో తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం మహాపాపం.
తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు
ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.
Read Also : Manish Sisodia: సిబిఐ విచారణకు సిసోడియా డుమ్మా