Tirumala Srivari Laddu case.SIT investigation begins

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం..సిట్ దర్యాప్తు ప్రారంభం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ ప్రారంభమైంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు కొత్త సిట్ ను నియమించింది. సీబీఐ చీఫ్ ఆద్వర్యంలో ఇద్దరు సీబీఐ ఆఫీసర్లు, ఇద్దరు రాష్ట్ర ఆఫీసర్లు, ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారితో సిట్ నియమించారు. ఈ సిట్ నియమించి నెల దాటిపోతున్నా ఇంకా విచారణ ప్రారంభించ లేదు. తాజాగా తిరుపతిలోనే కార్యాలయం ఏర్పాటు చేసుకుని విచారణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తరఫున హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పని చేస్తుంది.

సిట్‍ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని టీటీడీనే ఏర్పాటు చేస్తోంది. ఎంక్వైరీ పూర్తయ్యేవరకు కార్యాలయం నుంచే సిట్‍ తమ విచారణ నిర్వహించనుంది. సిట్‍ అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు రెడీ అయ్యారని అనుకోవచ్చు. 30 మందితో ప్రత్యేక టీంను కూడా వీరికి సహాయకారిగా ఉంచేందుకు సిద్ధం చేశారు. 4 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 2 ఎస్సైల సేవలను సిట్​ వినియోగించునే అవకాశాలు ఉన్నాయి. మరికొంత మంది మినిస్టీరియల్ సిబ్బందిని కూడా కేటాయించారు.

కాగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమించిన సిట్ చాలా వరకూ విచారణ చేసింది . కొత్త సిట్ మళ్లీ మొదటి నుంచి విచారణ చేస్తుందా లేకపోతే పాత సిట్ సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగిందని ఎఫ్‌ఎస్‌ఎస్ఐఏ కూడా నోటీసులు జారీ చేసింది. అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా చేశారన్న దగ్గర నుంచి సామర్థ్యం లేకుండా ఎక్కడి నుంచి నెయ్యి సేకరించారన్నది కూడా బయటకు తీయనున్నారు. మొత్తంగా సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత .. లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కల్తీ చేసిన వారికి గట్టి షాకులు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చని అంటున్నారు.

Related Posts
రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం
రేవంత్ రెడ్డి అధ్యక్ష తెలంగాణ కేబినెట్ సమావేశం

రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం తెలంగాణ కేబినెట్ ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more

కౌశిక్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కోసం వస్తామని చెప్పి రాలేదేంటి ..కాంగ్రెస్ ప్రశ్న
paadi koushik

డ్రగ్స్ పరీక్షల అంశంపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ బల్మూరి Read more

ఫిబ్రవరి 16 నాటికి ఢిల్లీ సీఎం ఎంపిక !
Selection of Delhi CM by February 16!

ప్రధాని స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి. న్యూఢల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా Read more

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపులు
JC

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి బెదిరింపులు రావడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తో జూబ్లీహిల్స్ లో ఇంటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *