Tirumala Srivari Laddu case.SIT investigation begins

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం..సిట్ దర్యాప్తు ప్రారంభం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ ప్రారంభమైంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు కొత్త సిట్ ను నియమించింది. సీబీఐ చీఫ్ ఆద్వర్యంలో ఇద్దరు సీబీఐ ఆఫీసర్లు, ఇద్దరు రాష్ట్ర ఆఫీసర్లు, ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారితో సిట్ నియమించారు. ఈ సిట్ నియమించి నెల దాటిపోతున్నా ఇంకా విచారణ ప్రారంభించ లేదు. తాజాగా తిరుపతిలోనే కార్యాలయం ఏర్పాటు చేసుకుని విచారణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

Advertisements

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) తరఫున హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పని చేస్తుంది.

సిట్‍ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని టీటీడీనే ఏర్పాటు చేస్తోంది. ఎంక్వైరీ పూర్తయ్యేవరకు కార్యాలయం నుంచే సిట్‍ తమ విచారణ నిర్వహించనుంది. సిట్‍ అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు రెడీ అయ్యారని అనుకోవచ్చు. 30 మందితో ప్రత్యేక టీంను కూడా వీరికి సహాయకారిగా ఉంచేందుకు సిద్ధం చేశారు. 4 డీఎస్పీలు, 8 మంది సీఐలు, 2 ఎస్సైల సేవలను సిట్​ వినియోగించునే అవకాశాలు ఉన్నాయి. మరికొంత మంది మినిస్టీరియల్ సిబ్బందిని కూడా కేటాయించారు.

కాగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమించిన సిట్ చాలా వరకూ విచారణ చేసింది . కొత్త సిట్ మళ్లీ మొదటి నుంచి విచారణ చేస్తుందా లేకపోతే పాత సిట్ సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏఆర్ డెయిరీ నెయ్యిలో కల్తీ జరిగిందని ఎఫ్‌ఎస్‌ఎస్ఐఏ కూడా నోటీసులు జారీ చేసింది. అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా చేశారన్న దగ్గర నుంచి సామర్థ్యం లేకుండా ఎక్కడి నుంచి నెయ్యి సేకరించారన్నది కూడా బయటకు తీయనున్నారు. మొత్తంగా సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత .. లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కల్తీ చేసిన వారికి గట్టి షాకులు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చని అంటున్నారు.

Related Posts
అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య
img1

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య ఉప్పల్ : ఒకపక్క అనారోగ్య సమస్యలు, మరో వైపు ఉన్న ఒక్క కుమారుడు తమకు దూరంగా ఉండడం, వృధ్యాప్యంలో వచ్చిన Read more

Show Time : ‘షో టైమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్
show time

Show Time : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన మూవీ ‘షో టైమ్’. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై Read more

సిరియా నుంచి 75 మంది భార‌తీయుల త‌రలింపు
Migration of 75 Indians from Syria

న్యూఢిల్లీ: సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా 75 Read more

ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ ను ప్రారంభించిన ఇమామి
Emami who started Fair and Handsome

కోల్‌కతా : పురుషులకు ముఖ మరియు చర్మ సౌందర్యానికి అత్యద్భుతమైన బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్. ఈ ఫెయిర్ Read more

×