తిరుమల : శ్రీవారి భక్తులకు మరింత సౌకర్య వంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Darshan Tickets) కేంద్రం సిద్దమైంది. ఈ కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఇఓ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury) తోకలసి ప్రారంభించారు. అత్యాధునిక మౌలక సదుపాయాలతో రూ. 60 లక్షల వ్యయంతో కొత్త కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు.

టికెట్ల పంపిణీ
నేటి నుంచి కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభమవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం హెచ్పీసీ, ఏఎన్సీ ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను టిటిడి (TTD) చైర్మన్ ప్రారంభించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాలయాలను పరిశీలించారు.
తిరుపతిలో ప్రసిద్ధమైన ఆహారం ఏమిటి?
తిరుపతి లో ప్రసిద్ధమైన ఆహారాలుగా పులిహోర, తిరుపతి లడ్డు (శ్రీవారి లడ్డు) ఉన్నాయి.
తిరుపతికి నెయ్యి ఎవరు సరఫరా చేస్తారు?
తిరుపతి లడ్డు తయారీపై కొంతకాలంగా జంతు కొవ్వు వాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నెయ్యి సరఫరా కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థకు చెందిన నందిని బ్రాండ్‌ను నియమించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Income Tax: ఆదాయపు పన్ను ఫైలింగ్ పై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఎపి ట్రాన్స్ కొ