తిరుమల : వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసీతెలియకో భక్తులు, ఆలయ సిబ్బందిచేత కలిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా జరిపించే పవిత్రోత్సవాలకు నేడు సోమవారం (Monday) రాత్రికి అంకురార్పణ జరగనుంది. శ్రీవేంకటే శ్వరస్వామికి ఆగస్ట్ 5వతేదీ (రేపటి) నుండి 7వరకు మూడురోజులు పవిత్రోత్స వాలు అత్యంత శాస్త్రోక్తంగా జరిపిస్తారు. శ్రీవారి ఆల యంలోని సంపంగిప్రాకారంలో కల్యాణోత్సవ మండపంలో మూడురోజులు జరిగే పవిత్రోత్స వాల కారణంగా ఆలయంలో స్వామివారికి జరిగే ఆర్జితసేవలు రద్దుయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల (Pilgrims) వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో శ్రీదేవిభూదేవి సమేల మలయప్పస్వామికి 5న పవిత్ర ప్రతిష్ట, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయంలో రేపటి నుండి మూడురోజులు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవలు రద్దయ్యాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :