తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు క్యూలోనే గుండెపోటు (Devotee suffers heart attack in queue) రావడంతో కుప్పకూలిపోయిన ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందారు.
కర్ణాటకకు చెందిన భక్తుడు..క్యూలో కుప్పకూలిన వేణుగోపాల్
వివరాల్లోకి వెళ్తే.. మృతుడిని కర్ణాటక (Karnataka) రాష్ట్రం మాలూరు ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ (వయసు 45)గా గుర్తించారు. శ్రీవారి దర్శనం కోరికతో ఈ నెల 17న ఒంటరిగా తిరుపతికి (Tirumala) వచ్చిన ఆయన, క్యూలైన్‌లో నిలుచున్న సమయంలో అనారోగ్యానికి లోనయ్యారు. నారాయణ గార్డెన్స్ వద్ద శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న వేణుగోపాల్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అక్కడ ఉన్న భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పందించిన టీటీడీ సిబ్బంది అంబులెన్స్ సాయంతో అతన్ని దగ్గరలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.

హార్ట్ స్ట్రోక్ – తర్వాత మెరుగైన చికిత్సకు తరలింపు
ఆసుపత్రిలో వైద్యులు వేణుగోపాల్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నిర్ధారించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అతన్ని SVIMS (శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కు తరలించారు. అక్కడ రెండు రోజులపాటు చికిత్స పొందిన వేణుగోపాల్ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందారు.
పోలీసులు స్పందన – మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు చర్యలు
ఘటనపై ఆసుపత్రి సిబ్బంది తిరుపతి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వేణుగోపాల్‌కు సంబంధించిన వివరాలు సేకరించి, కర్ణాటక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియలో ఉన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Heavy Rain Alert: వచ్చే ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు