Thirumala: తిరుమల (Thirumala) లోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు (Annaprasadam Trust)కు తాజాగా గణనీయమైన విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు పి. శ్రీకాంత్ శుక్రవారం రోజు రూ. 25 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆయన ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈ.ఓ సీహెచ్. వెంకయ్య చౌదరికు డిమాండ్ డ్రాఫ్ట్‌ను (DD) అందించారు. భక్తుల సంక్షేమం కోసం ఈ విరాళం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
తిరుమల (Thirumala) శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, సుమారు 26 కంపార్టుమెంట్లు (26 compartments) భక్తులతో నిండి పోయాయి. ఫ్రీ దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు సర్వదర్శనం పూర్తయ్యేందుకు సగటున 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం
నిన్నటి రోజున శ్రీవారిని 66,149 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో హుండీ ద్వారా రూ. 4.66 కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇది తిరుమల దేవస్థానానికి భక్తుల అఘాఢమైన విశ్వాసాన్ని ప్రతిబింబించనిది.
Read hindi news: hindi.vaartha.com
Read also: