Republic Day

ఢిల్లీ గణతంత్ర వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై స్పందించిన డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా.. 6 అంచెల సెక్యూరిటీ చెకింగ్స్ ఏర్పాటు చేశామని, ముఖ్యమైన ప్రదేశాలలో వీడియో కెమెరాలు, వీడియో అనలిటిక్స్, ఎఫ్ఆర్ఎస్మ ల్టీలేయర్ బారికేడింగ్ సిస్టమ్ ను సిద్ధంగా ఉంచామన్నారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరిస్తారని చెప్పారు.

భారీ బందోబస్తు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా చెప్పారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఢిల్లీలో వేలాది సీసీటీవీలు, కెమెరాలు ఇన్ స్టాల్ చేశామన్నారు. వీటిల్లో కొన్ని కెమెరాల్లో వీడియో అనలిటిక్ ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు. నేరస్థులు, వాంటెడ్ టెర్రరిస్టుల డేటాబేస్ ను సులభంగా గుర్తించేలా సీసీటీవీలో వివరాలను పొందుపర్చామని, వారికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కదలికలు కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్‌లు, పోలీసు సిబ్బందికి హెచ్చరికలు అందుతాయని డీసీపీ తెలిపారు. దాంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చేప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చీఫ్ గెస్ట్ గా ఇండోనేషియా అధ్యక్షుడుఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ కి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరుకానున్నారు. ఆయన జనవరి 23 నుండి జనవరి 26 వరకు భారతదేశంలోనే ఉంటారు. ఆయన పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌, ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖర్‌తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీ, దేశాధ్యక్షుడు ద్రౌపది ముర్ముతో కూడా ఆయన సమావేశం కానున్నారు.

Related Posts
త్రాగునీటి సమస్యను పరిష్కరించిన పవన్
pawan water

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆయన సూచనల మేరకు CSR నిధుల Read more

నెల్సన్ కథకు ఓకే చెప్పిన జూ.ఎన్టీఆర్..?
ntr nxt movie

'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్ ఓకే చెప్పారని Read more

CMR కాలేజీ కేసు: ఎఫ్‌ఐఆర్‌లో మల్లారెడ్డి సోదరుడి పేరు
CMR కాలేజీ కేసు: ఎఫ్‌ఐఆర్‌లో మల్లారెడ్డి సోదరుడి పేరు

ఇటీవల CMR కాలేజీ హాస్టల్ లో బాత్రూంలో కెమెరా ఏర్పాటు చేసిన కేసులో, మేడ్చల్ పోలీసుల దర్యాప్తులో నిందితులుగా హాస్టల్ వంటగది సిబ్బంది నంద కిషోర్ కుమార్ Read more

ఖాతా తెరవనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఢిల్లీని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంట్రీ తర్వాత అధికారానికి దూరమైంది. గత రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *