ట్రంప్‌ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్‌

Donald Trump: ట్రంప్‌ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్‌

గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ వుడ్స్‌ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాజీ కోడలు వెనెసా ట్రంప్ ‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది..’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు వెనెసాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వెనెసా సైతం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టైగర్‌ వుడ్స్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించారు.

Advertisements
ట్రంప్‌ మాజీ కోడలితో టైగర్ వుడ్స్ డేటింగ్‌

2018లో విడాకులు తీసుకున్న ట్రంప్‌ జూనియర్‌
కాగా, ట్రంప్‌ కుమారుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో 2005 నవంబర్‌ 12న వెనెసా వివాహం జరిగింది. ఫ్లోరిడాలోని ట్రంప్‌ ఎస్టేట్‌ మార్‌ ఎ లాగో క్లబ్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ట్రంప్‌ జూనియర్‌కు 2020లో ఫాక్స్‌న్యూస్‌ మాజీ హోస్ట్‌ కింబర్లీతో నిశ్చితార్థం జరిగింది.


టైగర్‌ వుడ్స్‌ కు పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు
ఇక టైగర్‌ వుడ్స్‌ గతంలో స్వీడిష్‌ మోడల్‌ ఎలిన్‌ నార్డెగ్రెన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే, 15 సార్లు మేజర్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ గోల్ఫర్ పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2010లో ఎలిన్‌ విడాకులు తీసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలిన్‌తో విడాకుల తర్వాత అమెరికన్ స్కీయింగ్ లెజెండ్ లిండ్సే వాన్, ఎరికా హెర్మన్‌ సహా పలు హై ప్రొఫైల్‌ ఉన్న వారితో సహజీవనం చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ మాజీ కోడలితో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించాడు.

Related Posts
ఎర్ర సముద్రంలో అమెరికా నేవీ F/A-18 కాల్పులు
red sea

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, డిసెంబర్ 22 తెల్లవారుజామున ఎర్ర సముద్రం మీదుగా ఇద్దరు U.S. నేవీ పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారు. వీరి F/A-18 ఫైటర్ జెట్ Read more

సిరియాలో కారు బాంబు పేలుడులో 15 మంది మృతి

ఉత్తర సిరియా నగర శివార్లలో సోమవారం కారు బాంబు పేలడంతో కనీసం 15 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు స్థానిక పౌర రక్షణ, యుద్ధ మానిటర్ Read more

చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు క్లారిటీ ఇచ్చిన రోహిత్
rohit sharma

ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తపై టీమిండియా Read more

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో మళ్లీ టాప్ మనమే
500x300 1410716 india winvjpg 1280x720 4g

భారత క్రికెట్ జట్టు తన ఆస్ట్రేలియా పర్యటనను అద్భుతంగా ప్రారంభించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల భారీ తేడాతో కంగారూలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×