భార్యను లాక్కెళ్లిన పులి.. సోషల్ మీడియాలో మళ్ళీ మళ్ళీ పోస్టుతో వైరల్

Tiger: భార్యను లాక్కెళ్లిన పులి.. సోషల్ మీడియాలో మళ్ళీ మళ్ళీ పోస్టుతో వైరల్

భర్తతో గొడవపడి కారు దిగిన మహిళను ఒక పెద్ద పులి లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మరికొన్ని వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. అందరి కళ్ల ముందే పులి ఆ మహిళను లాక్కెళ్లిపోయింది. ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను కనుగొనేందుకు సజగ్ బృందం ప్రయత్నించగా.. ఇది నిజమేనని తేలింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ మహిళకు
భర్తతో గొడవ తర్వాత కారు దిగిన మహిళను పెద్ద పులి లాక్కెళ్లింది – ఇన్‌స్టాగ్రామ్‌లో Pratahkal.live అనే ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ.. మహిళను పులి అడవిలోకి లాక్కెళ్లిందని రాశారు. . భర్త తన భార్యను కాపాడుకునేందుకు వేగంగా స్పందించాడని కొందరు కామెంట్లు పెట్టారు.

Advertisements

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు మేం (సజగ్ బృందం) ఈ వీడియో నుంచి కొన్ని కీఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ లెన్స్ సాయంతో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ట్విట్టర్‌లో గత కొన్నేళ్లుగా పలు హ్యాండిల్స్‌ నుంచి ఈ వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం.ఈ పోస్టులను పరిశీలించిన తర్వాత ఈ వీడియో ఇప్పటిది కాదని నిర్ధారణకు వచ్చాం.
ఈ ఘటన 2016లో చైనాలో జరిగింది

ఈ ఘటన 2016లో చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో జరిగింది. ABC వార్తా కథనంలోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఈ కథనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బీజింగ్‌లోని బడలింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఒక కుటుంబం సఫారీ చేసేందుకు వచ్చింది. వారి వాహనం సైబేరియన్ టైగర్ ఎన్‌క్లోజర్‌లో ఉండగా.. మహిళ తన భర్తతో గొడవపడి కారు నుంచి కిందికి దిగింది. దీంతో పులి ఒక్కసారిగా దాడి చేసి ఆమెను లాక్కెళ్లింది.
డ్రైవర్ సీట్లో ఉన్న భర్త వెంటనే తన భార్యను కాపాడుకునేందుకు ప్రయత్నించినా.. అతడి ప్రయత్నం ఫలించలేదు. పులి ఆమెపై దాడి చేసి చంపేసింది.

Related Posts
“శాంతి కోసం పోరాడండి, యుద్ధం నివారించండి” – తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టె
lai chang te

తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టె శనివారం హవాయీలో పర్ల్ హార్బర్ ఆక్రమణానికి సంబంధించిన స్మారక స్థలాన్ని సందర్శించాక, "యుద్ధానికి విజేతలు ఉండరు, శాంతి అనేది అమూల్యమైనది" అని Read more

Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లో కంపించిన భూమి
Massive earthquake in Afghanistan.. Earth shook in India

Earthquake : ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.9 గా గుర్తించారు. ఆఫ్గాన్‌లో సంభవించిన భూకంపం Read more

భారతీయులకు జో బైడెన్ శుభవార్త
visa

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ Read more

భారత దేశ యువకుడికి గిన్నిస్ వరల్డ్ రికార్డు
smallest washing machine split image

కేరళకు చెందిన సెబి సాజీ అత్యంత చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు .ఈ కొత్త ఆవిష్కరణ అనేక మందికి ప్రేరణగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×