తుల రాశి

తుల రాశి

తుల రాశి

19-03-2026  |  గురువారం
ఆదాయం 05
వ్యయం 14
రాజపూజ్యం 06
అవమానం 03

తులారాశి ఈ సంవత్సరం భాగ్యం, దశమం, లాభంలో గురువు, పంచమం, చతుర్దంలో రాహువు, షష్టమంలో శనీశ్వరుడు, లాభం దశమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు వనదుర్గ హెూమం జరిపించండి. చేతికి మహా పాశుపత కంకణం ధరించండి. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రయోజనాలను దక్కించుకుంటారు. చిన్న చిన్న పనులు మూడు వంతులు సజావుగా సాగిపోతాయి. ఏవో కొన్ని విషయాలలో మినహాయింపు. అన్ని విధాల సానుకూల ప్రభావము మార్పులే ఎక్కువగా ఏర్పడతాయి.

ఎలక్ట్రానిక్ వ్యాపారాలలో ఉన్న వారికి మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు గట్టిగా ప్రయత్నాలు చేసి క్లయింట్ని పెంచుకోవాలన్న ప్రణాళికలు సత్ఫలితాలను అందజేస్తాయి. ఇరుగు పొరుగు వారితో స్వల్పమైనటువంటి మనస్పర్ధలు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీ ఓర్పు సహనాన్ని వాళ్లు పరీక్షిస్తున్నట్టుగా భావిస్తారు వివాహ విషయాలు ముడిబడతాయి. శుభకార్యాలు చేయగలుగుతారు. కొన్ని బాధ్యతలను పూర్తి చేయగలుగుతాము లేదు నిలబడగలుగుతాము లేదు అన్న ఆలోచనలు తరచు బాధిస్తుంటాయి. అనవసరపు ఆలోచనలు అవసరంగా భావించి సుదీర్ఘకాలం ఆలోచించి ఎంతో ఒత్తిడికి గురవుతారు. మన స్థాపన చెందుతారు. కొన్ని విషయాలలో మీరు ఎంత పట్టుదలకు వెళ్లిన ఉపయోగం లేదు. జరగవలసిన మంచి ఎప్పుడు చేయి దాటిపోయింది. ఇది ఆలస్యంగా గ్రహిస్తారు.

ఇంటికి సంబంధించి కొత్త వస్తువులను పరికరాలను రుణాలలో తీసుకుంటారు. రక్తసంబంధమైన అనారోగ్యాలు, అజీర్తితో అవస్థలు పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడో చేయించుకున్న ఒక సర్జరీ కారణం చేత ఇప్పుడు బలహీనతలు సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి. ఫర్నిచర్ వ్యాపారస్తులకు పర్మిషన్ ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారస్తులకు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులైన వారికి బహుమతిగా ఇస్తారు. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు. కొంత కాలం ఆకర్షణ కానీ వ్యామోహంతో కానీ తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఎంతగానో బాధపడతారు. ద్వితీయ అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విజయాన్ని సాధిస్తారు. గవర్నమెంట్ పరీక్షలు ప్రైవేటు ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుతారు. ప్రభుత్వ సంబంధం అయిన వ్యక్తులతో తరచూ గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి.

కాంట్రాక్టులు, రావలసిన పెండింగ్ బిల్లులు మీ చేతికి అందుతాయి. 'కాదు' అని మీరనుకున్న పని చివరికి సానుకూలపడటం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. రాబోయే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వుంటాయి. కుటుంబంలో కొద్దిపాటి కలహాలు ఏర్పడినప్పటికీ కుటుంబ వ్యక్తులలో మంచి మార్పు గ్రహిస్తారు. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తించి, సమయోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయినవాళ్ళతో చర్చించేటప్పుడు ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి. ఆచితూచి మాటలు పొల్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు సర్వదా శ్రేయస్కరం లేదా అన్ని మీ తల మీదే వేసి మొత్తం మీదే బాధ్యత అని చేతులు దులుపుకునేవాళ్లు తయారవుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. వారిచ్చిన సలహాలతో వేసిన ప్రణాళికలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి ద్వారా పరోక్షంగా ధన లాభాన్ని మంచి పేరుని పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయాలలో శుభవార్తను వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వైద్యులను సంప్రదించి తగిన సమయానికి మంచి నిర్ణయం తీసుకోగలరు.

అలంకరణ వస్తు సామాగ్రి బ్యూటీ పార్లర్ ఇమిటేషన్ జ్యువలరీ వస్త్ర వ్యాపారస్తులకు మంచి లాభాలను పేరుని పొందగలుగుతారు. కాలక్షేపానికి కావచ్చు వ్యక్తిగత అభివృద్ధికి కావచ్చు కొన్ని నేర్చు కోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. తన కాళ్ళ మీద నిలబడాలి ఎవరిమీద ఆధారపడకూడదు అన్న విధంగా మీ ప్రవర్తన ఆలోచనలు మారిపోతాయి. సంపాదించిన ధనంలో కొద్ది భాగాన్ని పిల్లల పేరు మీద భద్రపరచాలని విస్తృత ప్రయత్నం చేస్తారు. ఆఖరి నిమిషాలలో మార్పులు ఏర్పడటం ఆ ధనం ఖర్చు కావడం బాధకి గురిచేస్తుంది.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం 60%
సంపద 80%
కుటుంబం 60%
ప్రేమ సంభందిత విషయాలు 40%
వృత్తి 80%
వైవాహిక జీవితం 40%
Sun

వారం - వర్జ్యం

తేది : 19-03-2026, గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం , చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు , శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె
అమావాస్య ఉ.6.53 , సా. పాడ్యమి తె.4.51 , ఉత్తరాభాద్ర తె.4.03
వర్జ్యం: మ.2.26-3.52
రాహుకాలం: మ.1.30 - 3.00

మీకు నచ్చవచ్చు