Pilibhit, Uttar Pradesh An

పిలిభిత్లో ఎన్ కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు మృతి

యూపీలోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటన స్థలంలో AK-సిరీస్ అసాల్ట్ రైఫిళ్లు మరియు రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిందితులను గురుదాస్‌పూర్‌కు చెందిన గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా గుర్తించారు.

ఎస్పీ పిలిభిత్ అవినాష్ పాండే మాట్లాడుతూ..“పంజాబ్ పోలీసుల బృందం SHO పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, పోలీసు అవుట్‌పోస్ట్‌పై దాడి చేసిన పంజాబ్‌కు చెందిన కొంతమంది ఉగ్రవాదులు పురాన్‌పూర్ ప్రాంతంలో తలదాచుకున్నారని సమాచారం అందించింది. వెంటనే మేము ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాము. ఖమారియా పాయింట్ వద్ద ఒక పోలీసు పికెట్ బృందం బైక్‌పై ముగ్గురు అనుమానితుల గురించి సమాచారాన్ని అందజేసింది.

వెంటనే పిలిభిత్, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం వారిని వెంబడించింది. బైక్‌పై వచ్చిన నిందితులు పోలీసు బృందంపై కాల్పులు జరపగా, ప్రతీకారంగా పోలీసు అధికారులు కూడా వారిపై కాల్పులు జరిపారు. అనుమానితులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని మేము ఆసుపత్రిలో చేర్చాము. ఈ ఘటనలో పిలిభిత్ పోలీసులకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడిన అనుమానితులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వారి నుంచి 2 ఏకే-47లు, 2 ఏకే రైఫిళ్లు, 2 విదేశీ తయారీ గ్లాక్ పిస్టల్స్, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. నిందితులకు విదేశీ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Related Posts
కత్తితో బీభత్సం సృష్టించిన దుండగుడు
కత్తితో బీభత్సం సృష్టిస్తున్నదుండగుడు

ఓ సీరియల్ కిల్లర్ నగరంలో బీభత్సం సృష్టించాడు. కనిపించినవారిని, ఎదురొచ్చిన వారిని కత్తితో దాడి చేశాడు. అరగంటలో ఐదుగురిపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో నగరం మొత్తం Read more

తెలంగాణలో నవంబర్‌ 6 నుంచి కులాల సర్వే ప్రారంభం
Caste survey to start in Telangana from November 6

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక, కులాల సర్వే నవంబర్ 6న ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో Read more

Modi, trump: ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు
ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు

ఉక్రెయిన్ , రష్యా మధ్య సంఘర్షణను ముగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు Read more

నిలిచిపోయిన టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్
TDP Youtubechannel

టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు అనూహ్యంగా నిలిచిపోయాయి. ఇది టీడీపీ కార్యకర్తలు, పార్టీ వర్గాల్లో ఆందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఛానల్ పూర్తి స్థాయిలో పనిచేయకుండా, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *