ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మధుర జిల్లాలో ఆదివారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. మసాని పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ నగర్ ప్రాంతంలో ఒక పాత బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటన అందర్నీ కలచివేసింది.బిల్డింగ్ కూలిన సమయంలో అది పూర్తిగా శిథిలాలుగా మారిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం (Three people died) చెందారు. మృతుల్లో ఒకరు 45 ఏళ్ల పురుషుడు కాగా, మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిలో ఒకరు ఆరేళ్లవారు కాగా మరొకరు కేవలం నాలుగేళ్ల బాలికగా గుర్తించారు.శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
జేసీబీతో శిథిలాల తొలగింపు
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తక్షణమే జేసీబీలను రంగంలోకి దించారు. శిథిలాలను ఎత్తి తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఒక వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.పరికి చిక్కినవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంత మంది ఇంకా శిథిలాల కింద ఉన్నారన్నది పూర్తిగా శిథిలాలను తొలగించిన తర్వాతే తెలుస్తుందని అధికారులు వెల్లడించారు.
పూర్తి దర్యాప్తు చేపట్టనున్న అధికారులు
ఈ విషాదకర ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. బిల్డింగ్ ఎందుకు కూలిపోయిందన్నదానిపై అసలు కారణాలు వెల్లడించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
దుఃఖంలో గోవింద్ నగర్ ప్రాంతం
ఈ ఘటనతో గోవింద్ నగర్ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. పక్కింటి ఇళ్లపై కూడా శిథిలాలు పడ్డ నేపథ్యంలో, మరిన్ని ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయేమోనన్న భయం నెలకొంది.
Read Also : Air India : విమానంలో సాంకేతిక సమస్య : నరకం చూసిన ప్రయాణికులు