America: 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి:హోం శాఖ

America: 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి:హోం శాఖ

అమెరికాలో ఎక్కువ కాలం పాటు ఉంటున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని హోం శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 30 రోజులకు మించి అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెడరల్ గవర్నమెంట్ వద్ద తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నేరారోపణలు మోపి, జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అమెరికా హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే, వెంటనే అమెరికాను విడిచి వెళ్ళడమే ఉత్తమ మార్గమని సూచించింది.అమెరికాను వీడటానికి ఇదే సరైన సమయమని, సామాను సర్దుకుని స్వదేశానికి విమానం ఎక్కాలని హోం శాఖ సూచించింది. ఎటువంటి నేర చరిత్ర లేనివారు, ఇక్కడ సంపాదించుకున్న డబ్బుతో నిశ్చింతగా వెళ్లిపోవచ్చని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా విమాన టికెట్ కొనుగోలు చేసే స్థోమత లేకపోతే, అమెరికా ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందని పేర్కొంది.

Advertisements

బహిష్కరణ

బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వారు ఒక్క రోజు ఎక్కువ సమయం ఉన్నా రోజుకు 998 డాలర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, సొంతంగా వెళ్ళిపోకపోతే 1,000 నుండి 5,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తామని తెలిపింది.నిబంధనలు పాటించని వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. భవిష్యత్తులో వారు చట్టపరమైన మార్గాల ద్వారా కూడా అమెరికాలో మళ్లీ ప్రవేశించే అవకాశం కోల్పోతారని హెచ్చరించింది.

నిబంధనలు

నిబంధనలు ప్రధానంగా హెచ్‌1బీ, విద్యార్థి వీసాలపై ఉండేవారికి వర్తించనప్పటికీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిపై మాత్రం కచ్చితంగా ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. ఒకవేళ హెచ్‌1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోయిన వారు నిర్ణీత గడువు దాటి ఇక్కడ ఉంటే వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు హెచ్‌1బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

  
America: 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి:హోం శాఖ

అమెరికాలో ఉంటున్న విదేశీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక హెచ్చరిక చేశారు.అమెరికా సందర్శించడం ఒక హక్కు కాదని, అది ఒక అవకాశం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.ఒక ప్రకటనలో, వీసా పొందినంత మాత్రాన ఎవరికీ దేశ బహిష్కరణ నుంచి మినహాయింపు ఉండదని రూబియో తేల్చి చెప్పారు.జాతీయ భద్రత, వలస విధానాల విషయంలో రాజీపడేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికాలోని కొన్ని కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థులు చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి మహమూద్ ఖలీల్ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు ఖలీల్‌ను దేశం నుంచి పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అమెరికా చట్టాలను, విలువలను గౌరవించే వారికే ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుందని రూబియో స్పష్టం చేశారు.

Read Also: America: అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు చేస్తాం: విదేశాంగ కార్యదర్శి రూబియో

Related Posts
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?

కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ Read more

ఆస్కార్ 2025 రద్దు?
ఆస్కార్ 2025 రద్దు

లాస్ ఏంజిల్స్ను నాశనం చేస్తున్న కొనసాగుతున్న అడవి మంటల కారణంగా 2025 అకాడమీ అవార్డులు రద్దు చేయబడవచ్చు. ది సన్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, అకాడమీ Read more

టర్కీలో భారీ పేలుడు: 12 మంది మృతి
turkey

టర్కీ వాయువ్య ప్రాంతంలోని బాలికేసిర్ ప్రావిన్స్‌లోని కవాక్లి గ్రామంలో ఒక పేలుడు సంభవించింది, దానికి కారణంగా 12 మంది మరణించగా, 4 మంది గాయపడ్డారు. ఈ ఘటనా Read more

Congress CLP Meeting : రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. నాలుగు అంశాలపై చర్చ!
Congress CLP meeting tomorrow.. Discussion on four issues!

Congress CLP Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×