తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress)కి ఇది చివరి పాలనగా మిగిలిపోతుందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ .. “జీవితంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం. ఒకవేళ వస్తే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వేలాడదీయండి” అని వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఇది తన మరణ వాంగ్మూలంగా భావించవచ్చని స్పష్టం చేశారు.
ప్రజలు విసుగు
రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) మాటల ప్రకారం.. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నేతల మాటలు వినడానికే ఇష్టపడటం లేదని చెప్పారు. “కాంగ్రెస్ నేతలు టీవీల్లో కనిపిస్తేనే ప్రజలు టీవీలు ఆఫ్ చేస్తున్నారు. ఇంతగా విసుగు తెప్పించే పాలన ఏదైనా ఉందా?” అంటూ ఆయన విమర్శించారు. ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అనుభవాన్ని త్వరలోనే గుర్తుంచుకుని తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ నాయకుడి కౌంటర్ రాజకీయాలు
రసమయి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు మళ్లీ హోరాహోరీగా విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ పడుతుందని రసమయి విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : Uttam Kumar Reddy : కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు