రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓడింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 145 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది.మ్యాచ్ అనంతరం,భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పరాజయంపై స్పందించాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను ఆయన కీలక కారణంగా పేర్కొన్నాడు. “ఆదిల్ రషీద్ తన నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి,తిలక్ వర్మను ఔట్ చేశాడు. అతని అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది,”అని సూర్యకుమార్ అన్నాడు.”రెండో ఇన్నింగ్స్‌లో మంచు ఎక్కువగా ఉంటుందని అనుకున్నాను.
![రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ భారత్ మధ్య మూడో టి20 మ్యాచ్](https://vaartha.com/wp-content/uploads/2025/01/రాజ్‌కోట్‌లో-ఇంగ్లాండ్-భారత్-మధ్య-మూడో-టి20-మ్యాచ్-1024x768.jpg.webp)
హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ మా చేతుల్లోనే ఉందని భావించాను. అయితే, ఆదిల్ రషీద్ దూకుడుగా ఆడిన తిలక్ వర్మను ఔట్ చేసి, మ్యాచ్‌ను తమ వైపునకి తిప్పాడు. అతను నిజంగా ప్రపంచ స్థాయి బౌలర్. అతనికి క్రెడిట్ దక్కాలి,” అని సూర్యకుమార్ అన్నాడు.భారత బ్యాటింగ్ విషయంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో, లక్ష్యాన్ని ఛేదించడం కష్టంగా అనిపించిందని,బ్యాటింగ్‌లో మరిన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకుమార్ చెప్పారు.
“ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం,”అని ఆయన చెప్పారు.ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ, “మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆదిల్ రషీద్ మా జట్టులో అత్యంత కీలక ఆటగాడు. అతని బౌలింగ్ లో వివిధ రకాల టెక్నిక్స్ ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్ కూడా మంచి బౌలర్.అతని ప్రత్యేకత నిలకడగా బౌలింగ్ చేయడంలో ఉంది. రషీద్, మార్క్ వుడ్ ఆఖర్లో విలువైన పరుగులు జోడించడం జట్టుకు మేలు చేసింది,” అని చెప్పారు.”ఇంగ్లండ్ విజయంలో, మా బౌలర్ల నైపుణ్యం, అనుభవం కీలక పాత్ర పోషించింది.