vijayasai reddy

జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు: విజయసాయి రెడ్డి

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు.

Advertisements

తన రాజీనామాతో కూటమికే లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారుతానని… అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్ మెంట్… ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు.

Related Posts
సింపుల్ క్యాచ్ ను వదిలేసిన రోహిత్‌
సింపుల్ క్యాచ్ ను వదిలేసిన రోహిత్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అవమానకరమైన క్షణాన్ని ఎదుర్కొన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో Read more

ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi will visit Gujarat today and tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక.. విశాఖ నగరంలో ప్రధాని Read more

వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు : షర్మిల
YCP does not have guts to go to assembly: Sharmila

సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అమరావతి: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ Read more

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్

అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ Read more

×