They are the reason I went to jail.. Raja Singh

Raja Singh : నేను జైలుకెళ్లేందుకు కారణం వారే : రాజాసింగ్

Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంతపార్టీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని, కొందరు నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. తనను జైలుకు పంపేందుకు మరోసారి ప్రయత్నించారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడి యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలే చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారని పేర్కొన్నారు.

నేను జైలు కెళ్లేందుకు కారణం

కార్యకర్తల కోసం పనిచేసే వారికి అధ్యక్ష పదవి

కాగా, బీజేపీకి త్వరలో నూతన అధ్యక్షుడు రానున్న తరుణంలో ఆయన కొందరు సీనియర్లపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌ని సీక్రెట్‌గా భేటీ అవుతున్నారని చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన స్వలాభం కోసం కాకుండా పార్టీ, కార్యకర్తల కోసం పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని రాజాసింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్

మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన పోలీసు అధికారుల పై కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలపై పోలీసులతో పెట్టుకోవద్దని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా గతంలో తనను అరెస్ట్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేసారు.

Related Posts
నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !
AP Cabinet meeting today..discussion on these issues!

అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. SIPB ప్రతిపాదనలకు ఏపీ Read more

చీరలు కట్టుకొని బస్సు ఎక్కి దివ్యాంగుల నిరసన
free bus scheme effect inno

ఆర్టీసీ బస్సుల్లో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ (D) వర్ధన్నపేటలో కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకొని బస్ ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీలో Read more

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
Distribution of pensions in

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి Read more

జేఈఈ అడ్వాన్స్డ్: సుప్రీంకోర్టు తీర్పు
జేఈఈ అడ్వాన్స్డ్: సుప్రీంకోర్టు తీర్పు

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్డ్) కోసం ప్రయత్నాల సంఖ్యను మూడు నుండి రెండుకు తగ్గించే నిర్ణయాన్ని సవాలు చేసిన విద్యార్థులకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉపశమనం కలిగించింది. నవంబర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *