'తల్లికి వందనం'లో నిబంధనలు ఇవే

‘తల్లికి వందనం’లో నిబంధనలు ఇవే

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు పై కసరత్తు ప్రారంభించింది. లబ్దిదారులు.. ఆర్దిక భారం పైన లెక్కలు సిద్దం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతా లో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా ఈ పథకం వచ్చే విద్య సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో, లబ్దిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు.

Advertisements

ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. తల్లికి వందనం నిధులు జూన్ లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా.. అర్హత, మార్గదర్శకాల పైన లబ్ది దారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

  'తల్లికి వందనం'లో నిబంధనలు ఇవే


అమలు పై కసరత్తు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం రూ 15 వేలు ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత రూ 14 వేలు, ఆ తరువాత రూ 13 వేలు చొప్పున అమలు చేసింది. కూటమి పార్టీ ల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంత మంది పిల్లలు ఉంటే అం త మందికి వారి తల్లుల ఖాతాల్లో రూ 15 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లో పథకం అమలు చేయకుండా 2025 జూన్ లో అమలు చేయాలని డిసైడ్ అయింది.

Related Posts
తిరుపతి శ్రీవారి ఆలయంలో 17వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేత
తిరుపతి శ్రీవారి ఆలయంలో 17వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేత

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం (ఫిబ్రవరి 28, 2025) భారీ భక్తుల రద్దీ నెలకొంది. ఈ రోజు, 52,731 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారి మొక్కులు Read more

మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని
మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి: కొడాలి నాని

జగన్ సీఎంగా వున్న సమయంలో మీడియాలో తరచుగా నోరుపాడేసుకున్న మాజీ మంత్రి కొడాలి నేడు మళ్లీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే Read more

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
CM Chandrababu brother Ramamurthy Naidu passed away

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో Read more

కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశం
cm cabinet

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. Read more