phone signal

ఇక ఏక్కడైనా సెల్ ఫోన్ సిగ్నల్

ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా వీడియో కాల్ ద్వారా ఆత్మీయులను పలకరిద్దామని చూస్తే సిగ్నల్ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో అయితే సిగ్నల్ కోసం కొండలు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు, గిరిజన గ్రామాలకు కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా సహా పలు ప్రాంతాల్లో 4జీ సెల్ టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. తొలిదశలో పార్వతీపురం, సీతంపేట, కురుపాం, భామిని వంటి మండలాల్లో 190 గ్రామాలకు టవర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొండప్రాంతాల్లో టవర్ల నిర్మాణం సవాళ్లతో కూడి ఉంది. నిర్మాణ సామాగ్రిని తరలించడం కష్టతరంగా మారింది. అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మట్టి రోడ్లు నిర్మించి టవర్ల సామాగ్రిని తరలిస్తున్నారు. ఈ కష్టాలను దాటుకుని కొన్ని చోట్ల టవర్ల నిర్మాణం పూర్తవ్వగా, మిగతా ప్రాంతాల్లో వేగంగా పనులు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 2,305 కొత్త 4జీ సెల్ టవర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ సహా జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. ఇవి పూర్తయితే 5,423 మారుమూల గ్రామాలకు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యలు త్వరలో చరిత్రగా మిగిలిపోవచ్చు. టవర్ల నిర్మాణంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఆర్థిక, విద్యా, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. ఈ చర్యలతో నూతన సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావడమే కాకుండా, డిజిటల్ యుగంలో అందరూ భాగస్వాములవుతారు.

Related Posts
సస్పెన్షన్ తర్వాత మల్లన్న టీం స్పందన
Theenmar Mallanna suspended from Congress party

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కులగణన వ్యవహారం భారీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. బీసీ కులగణనలో Read more

ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు: సీఎం
Incentives for those investing in the tourism sector: CM Revanth Reddy

భవిష్యత్తుకు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలి.. హైదరాబాద్‌: రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. Read more

జగన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు – అచ్చెన్నాయుడు
jagan mirchi

రైతులకు మేలు చేయని వ్యక్తి జగన్ జగన్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వులు గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర Read more

YCP: కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైసీపీ కైవసం
YSRCP wins Kadapa district ZP chairman post

YCP: కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ Read more