ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ఆటగాళ్ల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్టేడియంలో కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నప్పటికీ, అభిమానులు మైదానంలోకి చొచ్చుకురావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటీవల గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
రియాన్ పరాగ్ వద్దకు అభిమాని దూసుకెళ్లిన ఘటన
గువాహటి బర్సాపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తుండగా, రాజస్థాన్ రాయల్స్ స్టాండిన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సమయంలో ఒక్కసారిగా గ్యాలరీలో నుంచి ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించి, భద్రతా సిబ్బందిని మోసగించి నేరుగా పరాగ్ వద్దకు చేరుకున్నాడు. అతడు పరాగ్ కాళ్లు పట్టుకున్నాడు, అక్కడున్న ప్రేక్షకులు, ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు వెంటనే అప్రమత్తమై పరాగ్‌ను వారించాడు.అతడు పూర్తిగా పరాగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో, వెంటనే భద్రతా సిబ్బంది మైదానంలోకి ప్రవేశించి అభిమానిని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా, స్టేడియంలో భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి ప్రశ్నార్థకంగా మారాయి.
కోహ్లీ సంఘటన
గువాహటి ఘటన ఐపీఎల్ 2025లో అభిమానుల భద్రతా ఉల్లంఘనకు సంబంధించి రెండో ది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒక అభిమాని మైదానంలోకి ప్రవేశించి దగ్గరగా వచ్చాడు. ఐపీఎల్‌లో ఇలా తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతుండటంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఐపీఎల్‌లో భద్రతా పరమైన సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఈ టోర్నమెంట్‌లో, అభిమానులు ఇలా మైదానంలోకి ప్రవేశించడం ఆటగాళ్లకు ఇబ్బందిగా మారుతోంది. క్రికెట్‌లో అభిమానుల ప్రేమ సహజమే అయినప్పటికీ, ఇలా మైదానంలోకి చొచ్చుకెళ్లి ఆటగాళ్లను కలవడం భద్రతా వైఫల్యంకు నిదర్శనంగా మారుతోంది.ప్రస్తుత భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, అభిమానుల చెక్‌పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలు, స్టేడియం మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయడం అవసరం.
పునరావృతం
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కిందివి పాటించాల్సిన అవసరం ఉంది:భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు – స్టేడియంలో ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద భద్రతను మరింత పటిష్ఠం చేయాలి.టెక్నాలజీ ఉపయోగం – అనుమానాస్పద వ్యక్తులను ముందుగా గుర్తించాలి.అభిమానులకు అవగాహన కార్యక్రమాలు – క్రికెట్ అభిమానులకు ఆటగాళ్ల భద్రత గురించి అవగాహన కల్పించాలి.