There is no record of supporting farmers during the Congress regime.. Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్‌ హయాంలో రైతులను ఆదుకున్న దాఖలా లేవు : బండి సంజయ్‌

Bandi Sanjay : బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని బాంబ్‌ పేల్చారు బండి సంజయ్. ఇస్తే వద్దనను.. అధ్యక్షుడిగా ఇప్పటికే నేనేంటో నిరూపించుకున్నానని ప్రకటించారు. కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని ఆగ్రహించారు. కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దని బండి సంజయ్ కోరారు. పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారు.

Advertisements
కాంగ్రెస్‌ హయాంలో రైతులను ఆదుకున్న

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒక్కటే

నేను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానన్నారు. నియోజకవర్గ పునర్విభజన పై మీటింగ్ పెట్టుకున్న వారు దొంగల ముఠానేనని డీఎంకె పెట్టిన మీటింగ్ కి‌ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి వెళ్ళారని ఆగ్రహించారు. డిలిమిటేషన్ ప్రాసెస్,నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒక్కటే. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ సహకరిస్తోంది. ఢిల్లీలో కలిసి ఉంటారు. గల్లీలో కొట్లాడుకుంటారు. డీఎంకే భేటీకి రెండు పార్టీలు వెళ్లాయంటే. ఇద్దరూ ఒక్కటా?కాదా? కేసుల విషయంలో కేసీఆర్‌ కుటుంబానికి ఒక్క నోటీసు కూడా ఇవ్వట్లేదు. బీజేపీకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడుతున్నారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళికతో ఇదంతా

డీలిమిటేషన్‌ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఆరు గ్యారంటీల హామీల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. తమిళనాడులో డీఎంకే రూ.వెయ్యి కోట్ల మద్యం కుంభకోణం చేసింది. డీఎంకేను సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళికతో ఇదంతా చేస్తున్నారు. దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గించబోమని అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. డీలిమిటేషన్‌కు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదని చెప్పారు. చెన్నైలో జరిగేది మాఫియా ముఠాల సమావేశం. అవినీతి, స్కామ్‌ పార్టీలు కలిసి బీజేపీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు యత్నిస్తున్నాయి. అని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Related Posts
52 ఏళ్ల మహిళ సముద్రంలో 150 కిమీ ఈత!
52 ఏళ్ల మహిళ సముద్రంలో 150 కిమీ ఈత!

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని సూర్యరావుపేట తీరంలో 52 ఏళ్ల గోలి శ్యామల విశాఖపట్నం నుండి 150 కిలోమీటర్ల కఠినమైన ఈత కొట్టిన తరువాత సముద్రం నుండి బయటికి రావడంతో Read more

DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?
Are you drinking alcohol

మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్ పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో Read more

సిరియా నుంచి 75 మంది భార‌తీయుల త‌రలింపు
Migration of 75 Indians from Syria

న్యూఢిల్లీ: సిరియాలో నెలకొన్న పరిస్థితుల మధ్య అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా 75 Read more

IMD: ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం : ఐఎండీ
Rainfall is higher than normal this time.. IMD

IMD : ఈ సారి భారత్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×