Theenmar Mallanna suspended from Congress party

కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

హైదరాబాద్‌: కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షాకోజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను వివరణ కోరింది. షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Advertisements
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్

షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా చర్యలు

ఫిబ్రవరి 12 వరకు గడువు ఇచ్చినా, దాదాపు నెల కావస్తున్న షోకాజ్ నోటీసులకు బదులివ్వలేదు. మరోవైపు ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధిష్టానంపై, పార్టీలో ముఖ్య నేతలపై విమర్శల దాడిని పెంచడంతో షోకాజ్ నోటీసులపై స్పందించని కారణంగా తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

క్షమాపణ చెప్పాలని డిమాండ్

కాగా, కొన్ని రోజుల క్రితం వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు

Related Posts
కన్నడ నటుడు దర్శనికి మధ్యంతర బెయిల్
kannada actor darshan

కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. వెన్నెముకకు శస్త్రచికిత్స అవసరమని Read more

ట్రంప్ ఆహ్వానంతో అమెరికా వెళ్లనున్న మోదీ
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. జనవరి 27న Read more

కోర్ట్ తీర్పుతో అమృత కి న్యాయం జరిగింది
ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు – అమృతకు న్యాయం

2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ అమానుష ఘటనకు న్యాయస్థానం తుది Read more

దావోస్ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్
CM Revanth is ready to visit Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 20న దావోస్‌కు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం) నిర్వహించే వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు Read more