America: చైనీయులతో ప్రేమాయనాన్ని నిషేదించిన అమెరికా ప్రభుత్వం

America: చైనీయులతో ప్రేమాయనాన్ని నిషేదించిన అమెరికా ప్రభుత్వం

అమెరికా-చైనా మధ్య వివిధ రంగాల్లో పోటీ ఉంటుంది. ఒకరి కంటే మరొకరు దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుంటారు. అందుకే తమ రహస్యాలను మరొకరికి చేరకుండా గట్టి చర్యలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున పని చేస్తున్న వారు మరింత జాగ్రత్తగా ఉంటూ తమ రహస్యాలను కాపాడుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్న అమెరికా, చైనాలో ఉన్న తమ ఉద్యోగులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చైనీయులతో ప్రేమ, శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.

Advertisements

మినహాయింపు

చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌జౌ, షైంగై, షెన్యాంగ్, వుహాన్‌లోని కాన్సులేట్లలో పని చేస్తున్న అమెరికా సిబ్బంది చైనా పౌరులతో ప్రేమ, శారీరక సంబంధం పెట్టుకోవడానికి పూర్తిగా వీళ్లేదని తేల్చి చెప్పినట్లు వివరిస్తున్నారు. అయితే గతంలోనే చైనా పౌరులతో సంబంధాలు ఉన్న యూఎస్ సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇస్తుందన్నారు. అయితే తాము దీని కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పొరపాటున మినహాయింపులు తిరస్కరించబడితే వారు చైనీయులతో తమ బంధాన్ని ముగించాల్సి ఉంటుందని, అది కుదరని పక్షంలో తమ పదవులను వదులుకోవాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు.

నిషేధం

చైనాలో అమెరికా తరఫున పని చేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు సహా వారి కుటుంబ సభ్యులు చైనా పౌరులతో ఎలాంటి ప్రేమ, లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదని అమెరికా సర్కారు తేల్చి చెప్పింది. ఇలాంటి సంబంధాలపై తాము నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందే ఈ ఆంక్షలపై కాస్త ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. గతంలో చైనీయులతో బంధంపై సర్కారు అంత సీరియస్‌గా లేదని కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని కొందరు అధికారులు చెబుతున్నారు.

d014042aa53cbf380a7002f5097b37b5

అమెరికా సిబ్బంది,అక్కడి పౌరులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుంటే వారి పర్యవేక్షకులకు నివేదించాల్సి ఉండేది. కానీ లైంగిక, శృంగార సంబంధాలపై స్పష్టమైన నిషేధం విధించలేదు. మరి అమెరికా ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో సదరు ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.డేటింగ్ చేయకుండా, లైంగిక సంబంధం పెట్టుకోకుండా 1987 లో యూఎస్ ప్రభుత్వం నిషేదించింది.

Related Posts
ఐరిష్ పార్లమెంట్: డైల్ మరియు సెనేట్ సభ్యుల ఎంపిక విధానం
irish

ఐరిష్ గణరాజ్యం (రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్) తన పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఐర్లాండ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ప్రజల ద్వారా జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు Read more

విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం
విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం

విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ షిప్ సేవలు పెరుగుతున్నాయి. తాజాగా, కార్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖపట్నం చేరుకునే సమయం ఖరారైంది. ఈ క్రూయిజ్ షిప్ సర్వీసుల గురించి విశాఖపట్నం Read more

2026లో ప్రారంభం కానున్న “ప్రాజెక్ట్ సన్‌రైజ్”
qantas project sunrise

2026లో ప్రారంభం కానున్న ప్రపంచంలోని అతి పొడవైన విమాన ప్రయాణం, ప్రయాణికులకు రెండు సూర్యోదయాలను చూడట అనుభవం ఇస్తుంది. ఈ ప్రత్యేక ప్రయాణం కోసం ఎయిర్‌బస్ A350 Read more

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్
టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×