ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలలో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను కమలం పార్టీ మొదలుపెట్టింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలిసింది. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 19 లేదా 20న జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభా పక్ష సమావేశం ఫిబ్రవరి 17 లేదా 18న జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగించికుని ఇవాళ లేదా రేపు ఉదయానికి ప్రధాని ఢిల్లీకి రానున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంది.

Advertisements
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు


అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రధాని భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో చర్చలు జరిపి ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పదవులకు ఎంపిక చేస్తారు.
ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా ఆ పార్టీ కీలక నాయకులు పరాజయం పాలయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రభుత్వ అధిపతిని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించింది. ఐదుగురు నాయకులు కీలక పోటీదారులుగా ఉద్భవించారు.
పర్వేష్ వర్మకె ఎక్కువ అవకాశాలు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడేవారి జాబితాలో ముందున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేసిన సీనియర్ బీజేపీ నేత విజయేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కీలక బ్రాహ్మణ నేత సతీష్ ఉపాధ్యాయ్, కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, వైశ్య సమాజానికి చెందిన ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ ఇతర పోటీదారులుగా ఉన్నారు.

Related Posts
బోరుబావిలో చిన్నారి: శ్రమిస్తున్న అధికారులు
boy

రాజస్థాన్: డిసెంబర్ 11, పెద్దల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. నీటి కోసం పొలాల్లో బోరుబావులు గోతులు తీసి నీరు పడకపోతే మల్లి వాటిని Read more

Suicide: జార్ఖండ్ లో..ఘోరం ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది

జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లాలోని మహేశ్‌లిటి గ్రామంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. తండ్రి ముగ్గురు పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం Read more

అక్రమ వలసదారుల తరలింపులపై ప్రతిపక్షాల ఫైర్
flight

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా Read more

Elon Musk : ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం
ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పెస్ ఎక్స్ అండ్ టెస్లా అధినేత ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ టీంలో భాగమైనప్పటి నుండి అతని పై విద్వేషం పెరుగుతోంది. దీనికి Read more

×