boy

బోరుబావిలో చిన్నారి: శ్రమిస్తున్న అధికారులు

రాజస్థాన్: డిసెంబర్ 11, పెద్దల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. నీటి కోసం పొలాల్లో బోరుబావులు గోతులు తీసి నీరు పడకపోతే మల్లి వాటిని పూడ్చి వేయాలి అని కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టిన అదే వరుస. తాజాగా రాజస్థాన్​ దౌసాలోని బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 42 గంటలకు పైగా బోరుబావిలో ఉన్న చిన్నారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బోరుబావికి కొద్ది దూరంలో పైలింగ్‌ మిషన్‌తో 150 అడుగుల వరకు గొయ్యిను తవ్వుతున్నారు.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్యన్ తన తల్లితో ఆడుకుంటుండగా ఘటన జరిగింది. అనుకోకుండా ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో ఆర్యన్ ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్​ను అధికారులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దేవేంద్ర యాదవ్ అక్కడికి చేరుకుని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.తొలుత NDRF, SDRF బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్‌ ద్వారా ఆర్యన్‌ను బయటకు తీయడానికి చాలాసార్లు ప్రయత్నించాయి. కానీ విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత పలు విధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు పైలింగ్‌ మిషన్‌తో బోరుబావికి 4 నుంచి 5 అడుగుల దూరంలో 4 అడుగుల వెడల్పుతో గొయ్యి తీస్తున్నారు అధికారులు. 150 అడుగుల తవ్వకం పూర్తయిన తర్వాత, NDRF సిబ్బంది అందులో దిగి సొరంగం తవ్వి బాలుడి వద్దకు చేరుకోనున్నారు. అలా ఆర్యన్​ను కాపాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Advertisements

Related Posts
అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు
Sabarimala Yatra

IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని Read more

Pakistanis : భారత్ను వీడిన 537 మంది పాకిస్థానీలు
Pakistanis leaving India

కేంద్ర ఆదేశాల మేరకు, భారత్‌లో స్వల్పకాలిక వీసాలతో ఉన్న పాకిస్థానీ పౌరులకు గడువు విధించబడింది. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల్లో 537 మంది పాకిస్థానీలు అటారీ-వాఘా Read more

కాంగ్రెస్‌లో చేరిన ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
Pranab Mukherjee son Abhijit Mukherjee joined the Congress

కాంగ్రెస్‌ను వీడటం ఒక పొరపాటు నేను చింతిస్తున్నా.. కోల్‌కతా: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, లోక్‌సభ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తిరిగి కాంగ్రెస్‌ Read more

మంత్రిపై బురద జల్లి నిరసన తెలిపిన వరద బాధితులు
Villupuram Locals Throw Mud

తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన మంత్రి తిరు పొన్ముడికి చేదు అనుభవం ఎదురైంది. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఆయనపై బురద జల్లి Read more

Advertisements
×