యాపిల్ తన తాజా మోడల్ ‘ఐఫోన్ 16ఈ’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఇదే సమయంలో గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ‘ఐఫోన్ ఎస్ఈ 4’ మోడల్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ‘ఐఫోన్ ఎస్ఈ 4’ను విడుదల చేయాలనుకున్నప్పటికీ, చివరకు దాన్ని నిలిపివేసి ‘ఐఫోన్ 16’ సిరీస్‌లో భాగంగా ‘16ఈ’ మోడల్‌ను తీసుకువచ్చింది. కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌ను అందించేందుకు ‘ఐఫోన్ 16’ సిరీస్‌లో కొత్త వేరియంట్‌గా ను ‘16ఈ’ పరిచయం చేసింది.

ఐఫోన్ 16ఈ: భారత మార్కెట్లో ధర & ప్రీ ఆర్డర్ వివరాలు:
128 జీబీ వేరియంట్: అమెరికాలో ప్రారంభ ధర $599 (సుమారు రూ. 49,500). భారత మార్కెట్లో ఇది రూ. 59,900.
256 జీబీ వేరియంట్: భారత మార్కెట్లో ధర రూ. 69,900.
512 జీబీ వేరియంట్: ధర రూ. 89,900.
ప్రీ-ఆర్డర్ తేదీలు: ఈ నెల 21 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.
డెలివరీ తేదీలు: 28 నుంచి డెలివరీలు మొదలవుతాయి.
ఐఫోన్ 16ఈ ఫీచర్లు & స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
బయోమెట్రిక్స్: ఫేస్ ఐడీ సపోర్ట్.
ప్రాసెసర్: A18 చిప్‌సెట్, ఇది A13 బయోనిక్తో పోలిస్తే 80% వేగంగా పనిచేస్తుంది.
యూజర్ ఇంటర్‌ఫేస్: యాక్షన్ బటన్, డూ నాట్ డిస్టర్బ్ క్విక్ యాక్సెస్.
చార్జింగ్ & కనెక్టివిటీ: యూఎస్‌బీ-సి పోర్టు కలిగి ఉంది. నాచ్ డిజైన్ – ఫేస్ ఐడీ కోసం
ఐఫోన్ 16 సిరీస్‌తో తేడా:
ఐఫోన్ 16 సిరీస్ ప్రారంభ ధర రూ. 79,900, అయితే ‘ఐఫోన్ 16ఈ’ వేరియంట్ రూ. 59,900కి లభిస్తోంది. దీని ద్వారా యాపిల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్‌ను అందించాలనే ఉద్దేశంతోనే ఈ మోడల్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పోలిస్తే, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్.
ఐఫోన్ 16e భారతదేశంలో ఇది 128, 256, 512 మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్స్‌లో తయారు చేశారు. 16e ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. అంతేకాదు 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 800 నిట్స్ బ్రైట్‌నెస్ ను కొత్త మోడల్‌లో అందిస్తోంది యాపిల్ కంపెనీ. ఐఫోన్ 16e సింగల్ బ్యాక్ కెమోరాతో వస్తోంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను 16eకు యాడ్ చేశారు. ఐఫోన్ 16ఈ యాపిల్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గా మార్కెట్‌లోకి వచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియన్ యూజర్ల కోసం తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది.