The ongoing investigation into the Pastor Praveen Kumar case

pastor praveen: పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు

pastor praveen : పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ ఈనెల 24న అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్‌ తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పాస్టర్‌ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఐజీ వెల్లడించారు.

పాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కేసులో

అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం

కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని ఎస్పీ డి.నరసింహకిశోర్‌ తెలిపారు. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్‌ కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమహేంద్రవరం వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం అని ఎస్పీ తెలిపారు.

Related Posts
నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు ఏర్పాట్లు
cm revanth reddy district tour

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ Read more

హైదరాబాద్‌లో అక్రమ మద్యం స్వాధీనం!
హైదరాబాద్‌లో అక్రమ మద్యం స్వాధీనం!

హైదరాబాదులో ఎక్సైజ్ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు లక్ష రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. గోవా నుండి అక్రమంగా 22 లక్షల విలువైన మద్యం తరలింపు. సమాచారం Read more

ప్రతి ప్రత్యక్ష క్షణాన్ని క్యాప్చర్ చేయండి.. ఒప్పో
OPPO Reno13 series launched in India with new MediaTek Dimensity 8350 chipset and AI ready cameras

OPPO Reno13 సిరీస్ GenAIని ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది భారతదేశ మార్కెట్లో AI-శక్తితో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త కొలమానాలను నిర్దేశిస్తుంది. IP66 / Read more

మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇక ఆ బోర్డ్స్ కనిపించవు
wine shops telangana

వేసవి రాకముందే బీర్ల తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం తెలంగాణ మందుబాబులకు గుడ్‌న్యూస్. వేసవి రాకముందే బీర్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని వేగవంతం చేశాయి. ఇటీవల ప్రభుత్వ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *